Share News

జల చౌర్యాన్ని అడ్డుకోవాలి

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:11 PM

పాలమూరు - డిండి ఎత్తిపోతల పథకం ద్వారా జరుగుతున్న జల చౌర్యాన్ని అడ్డుకోవాలని పాల మూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్‌ ఇక్బాల్‌ పాషా కోరారు.

జల చౌర్యాన్ని అడ్డుకోవాలి
మాట్లాడుతున్న జిల్లా కన్వీనర్‌ ఇక్బాల్‌ పాషా

- పీఏవీ జిల్లా కన్వీనర్‌ ఇక్బాల్‌ పాషా

గద్వాల టౌన్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు - డిండి ఎత్తిపోతల పథకం ద్వారా జరుగుతున్న జల చౌర్యాన్ని అడ్డుకోవాలని పాల మూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్‌ ఇక్బాల్‌ పాషా కోరారు. ఈ నెల12వ తేదీన హైదరాబా ద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తలపెట్టిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని విజయవంతం చేయాలని శనివారం పట్టణంలోని టీజేఎస్‌ కా ర్యాలయంలో వివిధ సంఘాల నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణాన దుల అనుసంధానం ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలన్నారు. కృష్ణా జలాల్లో తెలం గాణ వాటాను పూర్తిగా సాధించాలన్నారు. జూ రాల కుడి కాలువను ఆధునీకీకరించాలని, తుం గభద్ర జలాలు జోగుళాంబ గద్వాల జిల్లాలోని చివరి ఆయకట్టుకు పూర్తిగా అందేలా ప్రభు త్వంపై ఒత్తిడి తేవాల్సి ఉందన్నారు. సమా వేశానికి సాగునీటి రంగ మేధావులు, రైతు సంఘాల ప్రతినిధులు, మేధావులు హాజరు కావాలన్నారు. గోపాల్‌, ప్రభాకర్‌, నాగరాజు, స్వామి, రెహమతుల్లా పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 11:11 PM