Share News

వివేకానందుని స్ఫూర్తితో ముందుకెళ్లాలి

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:31 PM

వివేకానందుని స్ఫూర్తితో ముందుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కొనియాడారు.

వివేకానందుని స్ఫూర్తితో ముందుకెళ్లాలి
భూత్పూర్‌లో వివేకానంద విగ్రహానికి నివాళి అర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆల

మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

భూత్పూర్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : వివేకానందుని స్ఫూర్తితో ముందుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కొనియాడారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం భూత్పూర్‌ చౌరస్తాలో ఆయన విగ్రహానికి మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌తో కలిసి పూలమాల వేసి నివాళళ అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వివేకానందుడు దేశానికి అందించిన సేవలను కొనియాడారు.

కోయిలకొండ : శ్రీ రామాంజనేయ యువజన సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించిన వివేకానంద జయంతికి నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి పాల్గొని, ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

గండీడ్‌ : యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకనంద అని మాజీ సర్పంచు పుల్లారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వెన్నాచేడ్‌, లింగాయిపల్లి, గండీడ్‌, రుసుంపల్లి, పగిడ్యాల్‌, కప్లాపూర్‌ గ్రామాల్లో వివేకనందుడి విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు.

దేవరకద్ర : దేవరకద్ర, కౌకుంట్ల మండల కేంద్రాల్లో వివేకనంద జయంతిని ఘనంగా జరుపుకున్నారు. గోపన్‌పల్లిలో వివేకనంద విగ్రహనికి ఎమ్మెల్యే జీఎంఆర్‌ సతీమణి కవిత పూలమాల వేసి నివాళి అర్పించారు.

Updated Date - Jan 12 , 2025 | 11:31 PM