Share News

Khammam: 40 ఏళ్లుగా మసిలే జలధారలు!

ABN , Publish Date - Mar 30 , 2025 | 02:33 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో 40 ఏళ్ల కిత్రం బొగ్గు అన్వేషణ కోసం 8 బోర్లు (డ్రిల్స్‌) వేయగా.. వాటిల్లో నుంచి వేడి నీరు రావడం ప్రారంభమైంది.

Khammam: 40 ఏళ్లుగా మసిలే జలధారలు!

  • బొగ్గు కోసం వేసిన బోర్ల నుంచి ఉబికి వస్తున్న వేడినీరు

  • సాగుకు వాడుకుంటున్న రైతులు

  • ఇటీవల భూకంపంతో రెండు బోర్లలో నీరు బంద్‌

  • భద్రాద్రి జిల్లా మణుగూరు ప్రాంతంలో భౌగోళిక విచిత్రం

మణుగూరు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో 40 ఏళ్ల కిత్రం బొగ్గు అన్వేషణ కోసం 8 బోర్లు (డ్రిల్స్‌) వేయగా.. వాటిల్లో నుంచి వేడి నీరు రావడం ప్రారంభమైంది. రెండు నెలల క్రితం ఈ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఆ ప్రభావంతో రెండు బోర్ల నుంచి నీరు రావడం ఆగిపోయింది. సింగరేణి కాలరీ్‌సలో మణుగూరు ఏరియా ఆవిర్భవించిన రోజుల్లో భూమి పొరల్లో ఉన్న బొగ్గును కనుగొనేందుకు నాడు మణుగూరు పరిసర గ్రామాల్లో పలుచోట్ల బోర్లు (డ్రిల్స్‌) వేశారు. భూమి పొరల్లో సుమారు 100 నుంచి 1,500 మీటర్ల లోతులో బొగ్గును కనుగొన్నారు. ఈ క్రమంలో మణుగూరు మండలంలోని పగిడేరు పంచాయతీ పరిధిలో అటవీ గ్రామాలైన గొల్లకొత్తూరు, కొడిశలకుంట, పగిడేరు గ్రామాల్లో 8 పాయింట్లలో బోర్లు వేయగా.. వాటి ద్వారా 1,000 మీటర్ల లోతునుంచి వేడి నీరు రావడం ప్రారంభమైంది. ఎలాంటి మోటార్లు, ఇంజన్ల సహాయం లేకుండానే నీరు రావడం ఆనాడు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నీటిని స్థానిక రైతులు సాగుకు ఉపయోగించుకుంటున్నారు. సుమారు 63 డిగ్రీల వేడితో ఉండే నీటిని కాలువల ద్వారా చిన్నచిన్న గుంతల్లోకి మళ్లించి చల్లారిన తర్వాత సాగుకు వినియోగిస్తున్నారు. ఈ నీటి ద్వారా ఈ ప్రాంతంలో సుమారు 200 ఎకరాలు సాగవుతోంది. అయితే ఈ బోర్లకు ఉన్న కేసింగ్‌ దెబ్బతిన్నదని, వాటిని పటిష్ఠం చేస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.


భౌగోళిక మార్పులు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ఏడాది డిసెంబరు 4న వచ్చిన భూకంపం ప్రభావంతో ఈ ప్రాంతంలోని భూగర్భంలో అనేక మార్పులు జరిగాయి. పగిడేరు సమీపంలో ఉన్న సింగరేణి కాలరీస్‌ కొండాపురం యూజీ మైన్‌పై కూడా భూకంపం ప్రభావాన్ని చూపింది. గనిలో ఉన్న పలు సొరంగాలలో ఆకస్మాత్తుగా నీరు రావడం ప్రారంభమైంది. ఈ గనిలో చేరిన నీటిని నేటికీ భారీ మోటార్లతో బయటికి తరలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే భూకంప ప్రభావంతో గొల్లకొత్తూరులో ఉన్న రెండు బోర్లు పూర్తిగా ఆగిపోయాయి. ఆ బోర్లలోని నీటి జల గనివైపునకు మళ్లి ఉంటుందని భావిస్తున్నారు. గతంలో ఇదే పగిడేరు పంచాయతీలోని ఖమ్మంతోగు, బుగ్గ అనే రెండు అటవీ గ్రామాల సమీపంలో ఒక వేడి నీటి కుంట, ఒక చల్ల నీటి కుంటలు ఉండేవి. ఈ రెండూ సమీప దూరాల్లోనే ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచేది.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..

GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 30 , 2025 | 02:33 AM