Share News

Medak: సైకిల్‌పై బస్టాండ్‌కు మెదక్‌ కలెక్టర్‌

ABN , Publish Date - Mar 24 , 2025 | 05:01 AM

మూడు రోజుల క్రితం పంట పొలాలను పరిశీలించిన మెదక్‌ కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ నేడు సైకిల్‌పై బస్టాండ్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Medak: సైకిల్‌పై బస్టాండ్‌కు మెదక్‌ కలెక్టర్‌

బస్సులో తిరుగు పయనం.. ప్రయాణికులతో ముచ్చట

రామాయంపేట, మార్చి 23(ఆంధ్రజ్యోతి): మూడు రోజుల క్రితం పంట పొలాలను పరిశీలించిన మెదక్‌ కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ నేడు సైకిల్‌పై బస్టాండ్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. కలెక్టర్‌ రాహుల్‌ ఆదివారం ఉదయం భార్య శ్రీజతో కలిసి సైకిల్‌ తొక్కుకుంటూ మెదక్‌ నుంచి 20 కి.మీల దూరంలోని రామాయంపేట బస్టాండ్‌కు వచ్చారు. బస్టాండ్‌లోని సౌకర్యాలను పరిశీలించారు. కలెక్టర్‌ వచ్చిన విషయం తెలిసిన వెంటనే డిపో మేనేజర్‌ సురేఖ బస్టాండ్‌కు వచ్చారు.


ప్రయాణికులకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని, పరిసరాల్లో చెత్తచెదారం లేకుండా చూడాలని ఆమెను కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం భార్యతో కలిసి ఆర్టీసీ బస్సులో టికెట్‌ తీసుకుని సామాన్యుడిలా మెదక్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ సమయంలో ప్రయాణికులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెదక్‌కు చేరుకున్నాక అక్కడి బస్టాండ్‌ను తనిఖీ చేశారు. వసతులను కల్పించాలని అధికారులకు రాహుల్‌ రాజ్‌ సూచించారు.

Updated Date - Mar 24 , 2025 | 05:01 AM