CMR College: బాత్రూంలో ఉండగా వీడియోలు.. CMR కాలేజ్‌లో హైటెన్షన్..
ABN , Publish Date - Jan 02 , 2025 | 02:35 PM
మేడ్చల్ సీఎంఆర్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. బాత్రూంలో ఉండగా వీడియోలు తీస్తున్నారని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.
Telangana: మేడ్చల్ సీఎంఆర్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. బాత్రూంలో ఉండగా వీడియోలు తీస్తున్నారని పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ఈ దారుణ ఘటనపై కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించాలని డిమాండ్ చేపట్టారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తామని వారికి హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. హాస్టల్‌లో వంట చేసే వారిపై అనుమానాలు రావడంతో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.