Share News

Metro train: ఏప్రిల్‌ 1 నుంచి రాత్రి 11.45 వరకు మెట్రో రైళ్లు..

ABN , Publish Date - Mar 30 , 2025 | 10:03 AM

మెట్రో రైల్ ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్. ఇకనుంచి రాత్రి 11.45 వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. దీనివల్ల ముఖ్యంగా ఐటీ కారిడార్ లో పనిచేసే ఉద్యోగులుకు ఎంతో ఉపయోగపడనుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమలు లోకి రానుంది.

Metro train: ఏప్రిల్‌ 1 నుంచి రాత్రి 11.45 వరకు మెట్రో రైళ్లు..

- సోమవారం నుంచి శుక్రవారం వరకు అమలు

హైదరాబాద్‌ సిటీ: ఉగాది పండుగ(Ugadi festival)ను పురస్కరించుకుని హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ(Hyderabad Metro Rail Corporation) శనివారం నగరవాసులకు శుభవార్త చెప్పింది. నగరంలోని మూడు కారిడార్లలో ప్రస్తుతం ఉదయం 6 నుంచి రాత్రి 10.45 గంటల వరకు రైళ్లు నడుస్తున్నాయి. అయితే పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌ 1 నుంచి మరో గంటపాటు అదనంగా సేవలను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నలుగురు కవలలు క్షేమంగా ఇంటికి..


ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటలకు రైళ్లు ప్రారంభమై.. రాత్రి 11.45 గంటల వరకు తిరుగుతాయని, శని, ఆదివారాల్లో ఉదయం 7గంటలకు మొదలై రాత్రి 11 గంటల వరకు నడుస్తాయని అధికారులు తెలిపారు. కాగా, కాలేజీ విద్యార్థుల సౌకర్యార్థం 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులను పొందే ఆఫర్‌ను 2026 మార్చి 31 వరకు పొడిగించామని, 2024 ఏప్రిల్‌లో ప్రారంభమైన సూపర్‌సేవర్‌ హాలిడే ఆఫర్‌ (ఎస్‌ఎ్‌సఓ), ఆఫ్‌ పీక్‌ ఆఫర్‌ ఆదివారంతో ముగుస్తుందని తెలిపిరు.


ముగిసిన మెట్రో ఆర్ట్‌ఫెస్ట్‌..

ఎర్రమంజిల్‌ మెట్రోస్టేషన్‌లోని ప్రీమియామాల్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న మెట్రో ఆర్ట్‌ ఫెస్ట్‌ శనివారం ముగిసింది. ఫెస్ట్‌ ముగింపు కార్యక్రమంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీ రెడ్డి పాల్గొన్నారు.

city4.2.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

40 ఏళ్లుగా మసిలే జలధారలు!

టెన్త్‌ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం

జములమ్మకు గద్వాల సంస్థానాధీశుల వారసుడి పూజలు

కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 30 , 2025 | 10:03 AM