చిక్కరు.. దొరకరు!
ABN , Publish Date - Feb 05 , 2025 | 12:09 AM
వ్యవసాయ అనుబంధరంగమైన ఉద్యాన పం టల సాగుపై ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తం గా నీలినీడలు అలుముకుంటున్నాయి. ఉద్యా న పంటలు ప్రధానంగా బత్తాయి, నిమ్మ, ఆయిల్‌పామ్‌తో పాటు బొప్పాయి, కూరగాయలు, పండ్లు, పూలు, అలంకరణ మొక్కలు అందులో భాగంగా ఉం టాయి.

రైతులకు అందుబాటులో ఉండని ఉద్యానశాఖ అధికారులు
తోటలకు తెగుళ్లు సోకితే సలహాలు, సూచనలు కరువు
పాత ఉమ్మడి జిల్లాలో హెచ్‌వోలతోనే కొనసాగుతున్న శాఖ
భవిష్యత్‌లో తోటల విస్తరణకు విఘాతం
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): వ్యవసాయ అనుబంధరంగమైన ఉద్యాన పం టల సాగుపై ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తం గా నీలినీడలు అలుముకుంటున్నాయి. ఉద్యా న పంటలు ప్రధానంగా బత్తాయి, నిమ్మ, ఆయిల్‌పామ్‌తో పాటు బొప్పాయి, కూరగాయలు, పండ్లు, పూలు, అలంకరణ మొక్కలు అందులో భాగంగా ఉం టాయి. రాష్ట్ర ప్రభుత్వం పాత ఉమ్మడి జిల్లాలో 59 మండలాలకు ఉన్న హెచ్‌వోలతోనే సరిపెడుతూ, ఉద్యానశాఖలో కొత్తగా ఒక పోస్టును కూడా పెంచలేదు. 8 నుంచి 10 మండలాలకు ఒక హెచ్‌వో (హార్టికల్చర్ అధికారి) మాత్రమే ఉండటంతో శాఖ పనితీరుపై రైతులు పెదవి విరుస్తున్నారు. హెచ్‌వోలు రైతులకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపిస్తున్నారు.
గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా పండ్ల తోట ల సాగులో దేశంలో నెంబర్‌వన్‌గా ఉండగా, కాలక్రమేణా అట్టడుగుకు పడిపోతోంది. గతంలో 3.50లక్షల ఎకరాల్లో పండ్ల తోట లు ఉండగా, ప్రస్తుతం మూడు జిల్లాల్లో 70 నుం చి 80వేల ఎకరాలకు మించి పండ్ల తోటలు లేవు. ప్రభుత్వం ప్రస్తుతంఆయిల్‌పామ్, కూరగాయల సాగుపై దృష్టిసారించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా లో ఆయిల్‌పామ్ సుమారు 17వేల ఎకరాల్లో సాగవుతోంది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 12వేల ఎకరా లు, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో 5వేల ఎకరాల్లో సాగవుతోంది. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సాహించాలనే ఆలోచనతో ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఇస్తోంది. కూరగాయ లు 6వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. దొండ పందిర్లు 800 ఎకరా ల్లో ఉండగా, ఇతర కూరగాయలు కూడా రైతులు సాగుచేస్తున్నా రు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 90యూనిట్ల కూరగాయల సాగుకు నిధులు మంజూరు చేసింది. ఎన్నికల కోడ్ రావడంతో కొత్త పథకా లు మంజూరు చేసే అవకాశం లేకపోవగా, పాత పథకాలు వెనుకబడ్డాయి. ప్రస్తుతం ఒక్క నల్లగొండ జిల్లాలో మాత్రమే బత్తాయి 43వేల ఎకరాలకు పడిపోగా, నిమ్మ 9వేల ఎకరాల్లో సాగవుతోంది.
ధరల హెచ్చుతగ్గు...
బత్తాయి, నిమ్మకు సం బంధించి తరచూ మా ర్కెట్, ధరలపై గందరగోళంగా ఉంది. ఎప్పుడు ధర తగ్గుతుందో, ఎప్పుడు పెరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. దీంతో బత్తాయి, నిమ్మ తోటల సాగుకు వెనుకంజ వేస్తున్నారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం అత్యధికం గా ఆయిల్‌పామ్ సాగుకే మొగ్గు చూపుతుండగా, ఆ తరువాత కూరగాయాలు, నిమ్మ, బత్తాయిపై దృష్టిపెట్టింది. రానున్న రోజుల్లో సైతం రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగునే ప్రోత్సహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిమ్మ, బత్తాయికి తెగుళ్లు బెడద అధికంగా ఉండటం సమస్యగా మారింది. దీనికి తోడు నిమ్మకు మాత్రమే నకిరేకల్‌లో మార్కెట్ ఉండగా, బత్తాయికి మాత్రం ఉమ్మడి జిల్లాలో మార్కెట్ లేదు. దీంతో వ్యాపారులు, దళారులు రైతుల నుంచి బత్తాయి కొనుగోలు చేసి ఢిల్లీ, పశ్చిమబెంగాల్, ముంబై వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా సరైన ధరలు దక్కని పరిస్థితి ఉంది. కరోనా సమయంలో బత్తాయి రైతులు తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యానశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం, ప్రభుత్వం సైతం పట్టించుకోకపోవడంతో బత్తాయి, నిమ్మ రైతులు అయోమయంలో పడ్డారు. ఆయిల్‌పామ్ సాగు వైపు రైతులు మొగ్గు చూపేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా మొక్కలు పంపిణీ చేసే కంపెనీల ప్రతినిధులకు అనుభవం లేక రైతులకు ఏదైనా సమస్య వస్తే వారికి వివరించి పరిష్కరించే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీనికి తోడు హెచ్‌వోలు సైతం పండ్ల తోట ల రైతులకు, ఆయిల్‌పామ్ సాగు రైతులకు అందుబాటులో ఉండటం లేదు. ఎవరైనా చిన్న, సన్నకారు రైతు ఫోన్ చేస్తే ఏదో ఒక మండలం, ఊరు పేరు చెప్పి తప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో 12వేల ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. ఉమ్మడి జిల్లాలో ఏళ్లుగా బత్తాయి మార్కెట్‌తోపాటు జ్యూస్‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని పార్టీలు హామీలు ఇస్తున్నా అమలుకు నోచడం లేదు.
మొక్కల నాణ్యతపై రైతులకు అనుమానాలు
బత్తాయి, నిమ్మ మొక్కలతో పాటు ఆయిల్‌పామ్ మొక్కల నాణ్యతపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానశాఖ అధికారుల సూచనల మేరకే చాలా మంది రైతులు గతంలో ఏపీలోని ప్రాంతాల నుంచి తెచ్చి నాటినా, బత్తాయి దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పలు చోట్ల చెట్లను తొలగించి వరి పొలాలను సేద్యం చేశారు. కాయ రాకుండా చెట్లు పచ్చగా ఉండటం తప్ప ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో రైతులు నష్టపోయారు. దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లిలోని రిసెర్చ్ సెంటర్ నిరుపయోగంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి మహారాష్ట్రంలోని నాగపూర్‌లో ఉన్న రిసెర్చ్ సెంటర్‌కు కొండమల్లేపల్లిలో ఉన్న కేంద్రానికి అనుసంధానం చేసి అధ్యయనం చేయాలని ప్రతిపాదనలు ఉన్నా ఆచరణ సాధ్యం కావడం లేదు. కొండమల్లేపల్లిలోని కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉద్యాన పరిశోధన స్థానాన్ని ఏర్నాటు చేశారు. ఇక్కడ 10ఎకరాలను ప్రత్యేకంగా మహారాష్ట్రలోని నాగాపూర్ పరిశోధన కేంద్రం, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యానశాఖకు అప్పగించాలని ప్రభుత్వం యోచించినా అది అమలుకాలేదు. దీంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కొన్ని నెలల క్రితం తిప్పర్తి, గుర్రంపోడుతో పాటు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పలు మండలాల రైతులు తిరుపతిలోని రిసెర్చ్ సెంటర్ నుంచి కొనుగోలు చేసిన బత్తాయి మొక్కలు తీసుకువచ్చి నాటారు. అవి పెద్దగా ఎదిగినా దిగుబడి రావడం లేదని రైతులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై నాగపూర్‌లోని రీసెర్చ్ సెంటర్‌కు లేఖరాసినా, ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది.
రైతులకు అందుబాటులో అధికారులు : వీవీఎ్‌స.సాయిబాబా, హార్టికల్చర్, సెరీకల్చర్ అధికారి, నల్లగొండ
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఉద్యాన రైతులకు అందించడంతో పా టు వారికి అధికారులు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఉద్యోగుల కొరత ఉన్న మాట వాస్తవమే. అయితే పోస్టుల మంజూరు కోసం ఇప్పటికే ప్రభుత్వానికి గతంలోనే నివేదిక ఇచ్చాం. త్వరలోనే కొత్త పోస్టులు మంజూరు కానున్నాయి. కొండమల్లేపల్లిలోని రీసెర్చ్ సెంటర్‌కు, మహారాష్ట్ర నాగాపూర్‌లోని రిసెర్చ్ సెంటర్‌కు అనుసంధానం చేయడం ద్వారా పండ్ల తోటల రైతులకు మరింత విస్తృతంగా సేవలు దక్కనున్నాయి.