మద్యం మత్తులో ప్రమాదాలకు చెక్
ABN , Publish Date - Jan 02 , 2025 | 12:24 AM
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం మత్తులో ప్రమాదాలకు చెక్‌పడింది. న్యూ ఇయర్ పేరుతో న్యూసెన్స్ సృష్టించే మం దుబాబులకు కట్టడిపడింది. ఈ ఏడాది వేడుకల సందర్భంగా ఒక్క ప్రమాదమూ జరగొద్దని, ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవద్దనే లక్ష్యంతో ‘యాక్సిడెంట్‌ఫ్రీ-ఇన్సిడెంట్‌ఫ్రీ’ నినాదంతో మూ డురోజుల నుంచి జిల్లా పోలీస్ యంత్రాంగం చే పట్టిన చర్యలు సఫలీకృతమయ్యాయి.
న్యూఇయర్ న్యూసెన్స్, డ్రంకెన్‌డ్రైవ్‌ను నిరోధించిన పోలీసులు
మూడు రోజుల నుంచే కార్యాచరణ
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ) : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం మత్తులో ప్రమాదాలకు చెక్‌పడింది. న్యూ ఇయర్ పేరుతో న్యూసెన్స్ సృష్టించే మం దుబాబులకు కట్టడిపడింది. ఈ ఏడాది వేడుకల సందర్భంగా ఒక్క ప్రమాదమూ జరగొద్దని, ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవద్దనే లక్ష్యంతో ‘యాక్సిడెంట్‌ఫ్రీ-ఇన్సిడెంట్‌ఫ్రీ’ నినాదంతో మూ డురోజుల నుంచి జిల్లా పోలీస్ యంత్రాంగం చే పట్టిన చర్యలు సఫలీకృతమయ్యాయి. జిల్లాలో సోమవారం ఆపరేషన్ చబూత్ర, మంగళ, బుధవారాలు డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా డిసెంబరు 31న రాత్రి 10 గంటల తర్వాత డ్రంకెన్‌డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిం చి సీరియ్‌సగా వ్యవహరించారు. ముందస్తుగా నే విస్తృతంగా ప్రచారం సాగించడంతో స్వచ్ఛందంగా చాలా మంది 10గంటలకే ఇళ్లకు చేరగా, ఆ తర్వాత జిల్లా కేంద్రంతో పాటు, ప్రధాన పట్టణాలు, రహదారులపై డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహించి ప్రమాదాలు, న్యూసెన్స్ ఘటనలు జరగకుండా నిరోధించారు.
31న విస్తృతంగా వాహన తనిఖీలు
ఈ ఏడాది డిసెంబరు 31న న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఒక్క ప్రమాదం గానీ, ఒక్క న్యూసెన్స్ ఘటన గానీ, ఆకతాయిల అల్లర్లు గానీ నమోదు కావద్దనే సంకల్పంతో రంగంలోకి దిగిన పోలీసులు సక్సెస్ అయ్యారు. మూడు రోజుల ముందు నుంచే ఆపరేషన్ చబూత్ర, రాత్రి 10గంటల తర్వాత వాహనాల తనిఖీలు, డ్రంకెన్‌డ్రైవ్ నిర్వహించారు. దీంతో చాలా వరకు యువత రాత్రి తొందరగా ఇళ్లకు వెళ్లాలనే ఆలోచనతో వ్యవహరించారు. రెస్టారెంట్లు, బార్లు, సిట్టింగుల వద్ద సైతం రాత్రి 10 తర్వాత మద్యం తాగడాన్ని ఆపేశారు. కాలనీల్లో, గ్రామాల్లో, రోడ్ల వెంబడి సమయం మించిన తరువాత మద్యం వాసన లేకుండా చూశారు. ఆతర్వాత కఠినంగా పట్టణాల్లోని ప్రధాన కేంద్రాల వద్ద, రోడ్లపై వాహనాల తనిఖీ, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. దీంతో పోలీ్‌సశాఖ లక్ష్యం విజయవంతమైంది. డిసెంబరు 31న జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్‌లో 246 మంది పట్టుబడ్డారు. వీరందరినీ 2వ తేదీన కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు ప్రకటించారు.
ముందస్తుగానే కట్టడికి ప్రణాళిక
జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక్క అవాంఛనీయ ఘటన కూడా జరగవద్దనే సంకల్పంతో పోలీసులు ముందస్తు ప్రణాళిక రూపొందించి కట్టడి చర్యలు చేపట్టారు. ప్రధానంగా అల్లర్లు సృష్టించే ఆకతాయిలు, రాత్రివేళ మద్యం మితిమీరి సేవించి ప్రమాదాలకు కారణమవుతున్న వారిని కట్టడి చేయాలని నిర్ణయించారు. 29వ తేదీ నుంచే అందుకోసం రంగంలోకి దిగారు. రాత్రి 10గంటల తర్వాత విస్తృతస్థాయిలో డ్రంకెన్ డ్రైవ్, వాహనాల తనిఖీలు ఆపరేషన్ చబూత్ర నిర్వహించారు. 29, 30 తేదీల్లో ఆపరేషన్ చబూత్ర నిర్వహించడంతో పాటు డ్రెంకన్‌డ్రైవ్ చేపట్టారు. అందులో 250 మందికి పైగా యువకులు పట్టుబడ్డారు. 128 డీడీ కేసులు, 62 పెట్టీ కేసులు నమోదయ్యాయి. 100కు పైగా వాహనాలు సీజ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాలపై 481 చలాన్లు విధించారు. డీడీ కేసుల్లో 97 మందిని కోర్టులో హాజరుపరచగా, రూ.1.19లక్షల జరిమానా, పెట్టీ కేసుల్లో 54 మందిని హాజరుపరచగా, రూ.56వేల జరిమానా, చలాన్ల ద్వారా రూ.3,51,665 జరిమానా విధించా రు. పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో స్నీఫర్‌డాగ్ ద్వారా నార్కోటిక్స్ బృందం తనిఖీలు నిర్వహించారు.
ప్రశాంతంగా వేడుకలు సంతోషదాయకం:శరత్‌చంద్రపవార్, ఎస్పీ
జిల్లాలో ఈ ఏడాది వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కావద్ద ని, మద్యం కారణంగా ప్రమాదా లు జరగకుండా నిరోధించాలనే లక్ష్యంతో మేం చేపట్టిన కార్యాచరణ విజయవంతం కావడం ఆనందం కలిగించింది. జిల్లాలో ఒక్క ఘటన, ఒక్క ప్రమాదమూ నమోదు కాలేదు. దీనికి సహకరించిన ప్రజలందరి కీ ధన్యవాదాలు. మూడురోజుల నుంచి ఈ లక్ష్యం కోసం పనిచేసిన డీఎస్పీలు, సీఐలు, పోలీసు సిబ్బందికి అభినందనలు. ఇదే క్రమశిక్షణతో యువత కుటుంబాలతో గడుపు తూ, వారి జీవిత లక్ష్యాలు సాధించాలని నూతన సంవత్సరం సందర్భంగా ఆకాంక్షిస్తున్నాం.
కిక్కే కిక్కు!
మద్యంపై ఒక్క రోజే రూ.12కోట్ల వ్యయం
రామగిరి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరం సందర్భంగా మద్యం ప్రియులు రూ.12 కోట్ల మద్యం లాగించేశారు. జిల్లాలో చండూరు, దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ, నకిరేకల్, నాంపల్లి మొత్తం ఏడు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 155 వైన్స్‌లు ఉన్నాయి. ఈ వైన్స్‌లో డిసెంబరు 31న రూ.12.95 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. సాధారణ రోజుల్లో ప్రతీ రోజు రూ.5కోట్ల మేర మద్యం విక్రయాలు జరుగుతుండగా, డిసెంబరు 31 అదనంగా రూ.7.95కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 2022 డిసెంబరు 31న రూ.19.7కోట్లు, 2023 డిసెంబరులో రూ.16.7కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోల్చితే కొంత ఆదాయం తగ్గింది.