అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా చూడాలి
ABN , Publish Date - Feb 28 , 2025 | 12:40 AM
మునిసిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా చూడాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం ఆయన భూదాన్‌పోచంపల్లి మునిసిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీచేశారు.

కలెక్టర్ హనుమంతరావు
భూదాన్‌పోచంపల్లి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా చూడాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం ఆయన భూదాన్‌పోచంపల్లి మునిసిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మునిసిపాలిటీ పరిధిలో ఉన్న పన్నుల వసూళ్లు ఇప్పటివరకు ఎంత పూర్తయ్యాయని కమిషనర్ అంజన్‌రెడ్డిని అడగ్గా, 49శాతం పూర్తయిందని తెలిపారు. పన్నుల వసూలు డిమాండ్ సమయానికి నోటీసులు జారీ చేస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. వార్డు ఆఫీసర్లు ప్రతిరోజు ఎంత వసూలు చేస్తున్నారని, కలెక్షన్ చేసిన డబ్బును బ్యాంకులో జమ చేస్తున్నారా? లేదా? అని తెలుసుకుని ఎప్పటికప్పుడు బ్యాంకులో డబ్బులు జమచేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ మునిసిపాలిటీలో ఉందా? లేదా? అని అడిగారు. ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్త వేరు చేసి సేకరిస్తున్నారా? లేదా? అని అడిగారు. టీయూఎ్‌ఫడీసీ పనులకు సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయని, పార్కు పనులు పూర్తి చేశారా? అని అడిగారు. పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలుపగా ఎస్‌ఈతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే రీటెండర్ చేయాలన్నారు. పెండింగ్‌లో ఉండకుండా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు, బిల్డింగ్ పర్మిషన్లు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. ప్రతీరోజు ఉదయం వార్డులలో శానిటేషన్ తప్పకుండా చేయాలని, వార్డులను పరిశుభ్రంగా ఉంచాలని, సిబ్బంది అందరూ వార్డుల్లో ఉండేవిధంగా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, ఇన్‌చార్జి తహసీల్దారు నాగేశ్వర్‌రావు, ఎంఆర్‌ఐ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.