Share News

నీటిని వృథా చేయొద్దు

ABN , Publish Date - Jan 02 , 2025 | 12:25 AM

సాగునీటిని వృథా చేయవద్దని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. బుధవారం జనగాం జిల్లా కొండకండ్ల మండలంలోని బయ్యన్న వాగు నుంచి ఎస్పారెస్పీ రెండో దశకు నీటిని సూర్యాపేట జిల్లాకు చెందిన నీటి పారుదలశాఖ అధికారులతో కలిసి విడుదల చేసి,మాట్లాడారు.

నీటిని వృథా చేయొద్దు

తిరుమలగిరి రూరల్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : సాగునీటిని వృథా చేయవద్దని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. బుధవారం జనగాం జిల్లా కొండకండ్ల మండలంలోని బయ్యన్న వాగు నుంచి ఎస్పారెస్పీ రెండో దశకు నీటిని సూర్యాపేట జిల్లాకు చెందిన నీటి పారుదలశాఖ అధికారులతో కలిసి విడుదల చేసి,మాట్లాడారు. యాసంగి సీజనకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ఆరు విడతల్లో వారబంధి పద్ధతిలో నీటిని విడుదల చేస్తారని, రైతులు ఈ నీటిని పొదుపుగా వాడి పంటలు పండించుకోవాలన్నారు. ఆయకట్టు చివరి భూముల వరకు నీరందిం చేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైతులు ఎక్కువగా ఆరుతడి పంటలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. చెరువులకు, కుంటలకు గండ్లు పడకుండా చూసుకొని నీటిని వాడుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సన్న ధాన్యానికి బోనస్‌ ఇచ్చిందన్నారు. రూ.2లక్షల్లోపు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 12:25 AM