విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య
ABN , Publish Date - Jan 02 , 2025 | 12:24 AM
:పేద బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించడం ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
కోదాడ టౌన, జనవరి 1 (ఆంధ్రజ్యోతి):పేద బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించడం ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం కోదాడలోని ముస్లిం, మైనార్టీ బాలికల పాఠశాలను ఎమ్మె ల్యే పద్మావతిరెడ్డి, రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన పటేల్ రమే్‌షరెడ్డిలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాఠశాలలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు వచ్చానని, సమాజంలో విద్య ద్వారానే గుర్తింపు వస్తుందన్నారు.అందుకోసమే రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. ప్రతీ నియోజకవర్గంలో రూ.300 కోట్ల తో అంతర్జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. అదేవిధం గా స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని రాబోయే కాలంలో రాష్ట్ర అక్షరాస్యత 100 శాతానికి చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. వివిధ సమస్యలను విద్యార్థులు మంత్రి దృష్టి తీసుకొని రాగా నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు అందరూ ఇంగ్లీ్‌షలో మాట్లాడటం చాలా సంతోషమన్నారు. అలాగే ఉపాధ్యాయులు రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అభినందనీయమన్నారు. ఇంటర్, పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన పటేల్ రమే్‌షరెడ్డి మాట్లాడుతూ మంత్రి నూతన సంవత్సర వేడుకలను విద్యార్థులతో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. పాఠశాలని డిగ్రీ వరకు అప్‌గ్రేట్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీవో సూర్యనారాయణ, జిల్లా మైనార్టీ అధికారి జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ వాజీద్, ఎంఈవో సలీంషరీఫ్, ప్రిన్సిపాల్ మాధురిశర్మ, ఆర్‌ఐ రాజేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.