కొత్త సంవత్సరంపై కొంగొత్త ఆశలు
ABN , Publish Date - Jan 01 , 2025 | 12:41 AM
నూతన సంవత్సరంపై పట్టణవాసులు కోటి ఆశలు పెట్టుకున్నారు. 1953 నుంచి మునిసిపాలిటీగా, పంచాయతీరాజ్ వ్యవస్థ అమలులో కి వచ్చిన కొత్తలో తాలూకా కేంద్రంగా, అనంతరం డివిజన కేంద్రంగా భువనగిరి ఏర్పడింది.
2025లోనైనా ఇక్కట్లు తీరేనా..
జిల్లా ప్రజల ఆశావహ దృక్పథం
భువనగిరి టౌన, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరంపై పట్టణవాసులు కోటి ఆశలు పెట్టుకున్నారు. 1953 నుంచి మునిసిపాలిటీగా, పంచాయతీరాజ్ వ్యవస్థ అమలులో కి వచ్చిన కొత్తలో తాలూకా కేంద్రంగా, అనంతరం డివిజన కేంద్రంగా భువనగిరి ఏర్పడింది. అలాగే మొదటి నుంచి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా, 15 సంవత్సరాల క్రితం పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం గా, జిల్లాల పునర్విభజనతో ఏడేళ్ల క్రితం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిం ది. ప్రభుత్వ వ్యవస్థలపరంగా భువనగిరి పట్టణానికి గుర్తింపు లభిస్తున్నా అభివృద్ధిలో మాత్రం వెనుకంజలోనే ఉంది. ఈ నేపథ్యంలో 2025 సం వత్సరంలోనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యలు తీరుస్తారని, పట్టణాభివృద్ధికి కృషి చేస్తారని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు. ఇదిలా ఉండ గా జిల్లా ప్రజలు 31న అర్ధరాత్రి పాత ఏడాదికి వీడ్కోలు, కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ సంబరాలు చేసుకున్నారు. వీధుల్లోకి వచ్చిన యువత, ముగ్గులు వేస్తూ మహిళలు అర్ధరాత్రి వరకు సందడి చేశారు. ప్రభుత్వ వ్యవస్థల పరంగా భువనగిరి పట్టణానికి గుర్తింపు లభిస్తున్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం వెనకంజలోనే ఉంటోంది. ఫలితంగా నాటి నుంచి నేటి వరకు ప్రజలకు ఇబ్బందులు మాత్రం తప్ప డం లేదు. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలోనైన ప్రజాప్రతినిధులు, అధికారులు మా సమస్యలను తీరుస్తారని, పట్టణాభివృద్ధికి కృషి చేస్తారని 70వేల మంది ప్రజలు ఆశిస్తున్నారు.
డబుల్ బెడ్‌రూమ్‌లో గృహప్రవేశాల కోసం
స్థానిక సింగన్నగూడెంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల 444 మంది లబ్ధిదారులను లాటరీ విధానంలో ఏడాదిన్నర క్రితం ఎంపిక చేపి పట్టాలు అందజేశారు. కానీ నివాసయోగ్యం లేని ఆ ఇళ్లలో తాగునీరు, విద్యుత, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల కోసం అప్పట్లోనే రూ.4.50 కోట్లతో ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రభుత్వానికి అధికారులు నివేదిక అందజేశారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు మానరినప్పటికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనుల పురోగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగలిలా అక్కడే ఉండటంతో లబ్ధిదారులు అద్దె ఇళ్లలోనే జీవనం సాగిస్తున్నారు. కానీ ఈ సంవత్సరమైనా సొంతింటి కల నెరవేరాలని తాము నమ్మే దేవుళ్లను మొక్కుకుంటున్నారు.
100 ఫీట్ల రహదారి విస్తరణ పనులు కొలిక్కి వచ్చేనా?
పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనులకు సుమారు పది సంవత్సరాల క్రితం అప్పటి కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రూ.24కోట్ల వ్యయంతో ఐదేళ్ల నుంచి దశలవారీగా పను లు నడుస్తూనే ఉన్నాయి. చివరాకరికి చేరిన పనుల్లో విద్యుత టవర్ల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇంకా ఆధునిక వీధి దీపాలు, వాకింగ్ పాతపై టైల్స్, ఆక్రమణల తొలగింపు, ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉన్నది.
ప్రయాణ కష్టాలు తీరేనా?
భువనగిరి పట్టణం గుండా అన్ని దూర ప్రాంతాలకు బస్సులు, రైళ్లు వెళుతుంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఆగవు. దీంతో ఆగకుండానే వెళుతున్న బస్సులను, రైళ్లను చూస్తూ తృప్తి పడాల్సిన పరిస్థితి స్థానికులది. కానీ కొంతకాలంగా జిల్లా కేంద్రం భువనగిరి నుంచి జిల్లా అంతటా అన్ని మార్గాల్లో సరిపడా ఆర్టీసీ బస్సులు నడుపుతామని, ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి సహా అన్ని ప్రాంతాలకు వెళ్లే రైళ్లు భువనగిరిలో త్వరలో ఆగనున్నాయని ప్రజాప్రతినిధులు, అధికారులు ఇచ్చిన హామీలు నెరవేరి 2025 సంవత్సరం నుంచి అయినా ప్రయాణ కష్టాలు తీరుతాయని స్థానికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల్ల కోసం
భువనగిరి పట్టణ జనాభా సుమారు 70 వేలు ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రభుత్వం ఇచ్చిన హామీతో సుమారు 9వేల మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. అర్హులు గుర్తింపు సర్వే సాగుతోంది. పథకం మొదటి దఫాలో నియోజకవర్గ 3500 మందికి లబ్ధి చేకూరుస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పట్టణంలోని అర్హులైన నిరుపేదలు ప్రభుత్వం ఇచ్చే రూ. 5లక్షలకు మరిన్ని సొంత పైసలకు జోడించి సొంతింటిని కట్టుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.
క్రీడాకారులు, విద్యార్థుల ఆశలు
జిల్లా కేంద్రంగా ఉన్న భువనగిరిలో క్రీడలకు, వాకర్స్‌కు ఏకైక దిక్కు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ మాత్రమే. కానీ సంరక్షణ చర్యలు లేకపోవడంతో అసౌకర్యాల నడమే క్రీడాకారులు, వాకర్స్ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఇండోర్ స్టేడియం ఉన్నప్పటికీ క్రీడ వసతులు లేకపోవడం, ప్రహరీ నిర్మించక పోవడంతో ఆక్రమణలకు గురివుతోంది. అలాగే నూతన ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో పట్టణ శివారులో 10 ఎకరాల్లో రూ. 100 కోట్లతో మల్టీపర్పస్ స్టేడియం నిర్మించనున్నట్టు పాలకులు ఇచ్చిన హామీ నూతన సంవత్సరంలో నైనా నెరవేరాలని క్రీడాకారులు ఆశిస్తున్నారు.
మెరుగైన వైద్య సేవల కోసం
ఇటీవలి వరకు భువనరిరి జిల్లా ఆస్పత్రిని నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలకు బోధన ఆస్పత్రిగా మార్పు చేశారు. దీంతో గతంతో పోలిస్తే పలువురు స్పెషలిస్ట్ వైద్యులు, పలు నూతన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. రూ.200 కోట్లతో రెండవ అంతస్తు నిర్మాణం పనులు సాగుతున్నాయి. టీ-హబ్‌లో త్వరలోనే సిటీస్కాన సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. అయిప్పటికీ గర్భిణీలకు కడుపు కోత, ప్రైవేట్ లేదా హైదరాబాద్ ఆస్పత్రిలకు రెఫరల్ తప్పడం లేదు. ట్రాన్సజెండర్లకు మైత్రి క్లీనిక్ కూడా ప్రారంభంమైంది. ఈ మేరకు బోధన ఆస్పత్రిలో రోగులకు పూర్తిస్థాయి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని అధికారులు, ప్రతినిధులు ఇస్తున్న హామీలు నెరవేరి తమపై ఫీజుల రూపేనా ఆర్థిక భారం తప్పుతుందని ఆశాభావంతో ఉన్నారు.
మౌలిక సదుపాయాల ఇక్కట్లపై
ఉమ్మడి జిల్లాలోనే సీనియర్ మునిసిపాలిటీగా ఉన్న భువనగిరిలో అంతే స్థాయిలో సమస్యలు తిష్ట వేసి ఉన్నాయి. 35వార్డులతో కూడిన పట్టణంలో పలు బస్తీలలో సీసీ, బీటీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురువుతున్నారు. రికార్డుల ప్రకారం పదుల సంఖ్యలో పార్కులు ఉండగా మరిన్ని నూతన పార్కులకు ప్ర తిపాదనలు ఉన్నాయి. కొన్ని పనులకు అనుమతులు, టెండర్లు జరిగినప్పటికీ స్పష్టత కొరవడింది. మినీట్యాంక్ బండ్‌గా అభివృద్ధి పరిచే లక్ష్యంతో చెరువు కట్టపై సుమారు రూ. 7 కోట్ల వ్యయంతో ఏడాదిన్నర క్రితం చేపట్టిన పనులు నేటీకి నత్తనడకను మరిపిస్తున్నాయి. అలాగే వెల్లువలా సాగుతున్న అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలతో రహదారులు ఇరుకుగా మారుతున్నాయి. దీంతో నూతన సంవత్సరంలోనైనా అభివృద్ధి పనుల పూర్తి, ఆక్రమణ నియంత్రణతో పట్టణం న్యూ లుక్‌ను సంతరించుకుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.