సత్కర్మలు చేస్తేనే మానవ జన్మకు సార్థకత
ABN , Publish Date - Jan 13 , 2025 | 12:19 AM
సత్కర్మలు, సదాచరణలు చేస్తూ మానవ జన్మను సార్థకం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.శాంతికుమారి అన్నారు. ఆదివారం ఆలేరు మండలం కొలనుపాకలోని మాతా పితృ గోశాలలో జరిగిన చతురాయతన సహిత శత చండీ యాగంలో చివరి రోజు కార్యక్రమం లో ఆమె ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.శాంతికుమారి
ఆలేరు రూరల్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): సత్కర్మలు, సదాచరణలు చేస్తూ మానవ జన్మను సార్థకం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.శాంతికుమారి అన్నారు. ఆదివారం ఆలేరు మండలం కొలనుపాకలోని మాతా పితృ గోశాలలో జరిగిన చతురాయతన సహిత శత చండీ యాగంలో చివరి రోజు కార్యక్రమం లో ఆమె ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక కల్యాణార్థం ఈ శత చండీ యాగాన్ని నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ప్రకృతిని ప్రేమి స్తూ ప్రకృతి సంపదలను కాపాడుకోవడం ద్వారానే మానవ మనుగడ సాధ్యన్నారు. శృంగే రి మఠానికి చెందిన బాషంపల్లి సంతో్‌షకుమార్ మాట్లాడుతూ కన్నతల్లిదండ్రుల పట్ల ప్రేమను చూపుతూ వారిని సంతోషంగా ఉండేటట్లు చూడడం ద్వారానే పుణ్యం సిద్ధ్దిస్తుందన్నారు. మానవుడు స్వలాభాపేక్షలేని కర్మలు నిర్వహించాలని, దీని ద్వారానే ఇష్టాశక్తి క్రియాశక్తి, జ్ఞానశక్తి లభిస్తుందన్నారు. మన జన్మ, మన కర్మ మంచిగా ఉండాలంటే మాతృదేవతలను పూజించడంతో పాటు యజ్ఞ యాగాదులను నిర్వహించాలన్నారు. గోక్షేత్రంలో చేసే యాగాలతో కోటి శక్తుల ఫలితం దక్కుతుందన్నారు. ముందుగా ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి శాంతికుమారి గోసందర్శన చేసి శతచండీ యాగంలో పాల్గొన్నారు. సీఎస్ శాంతికుమారి ఆలేరుకు చేరుకోగానే తహసీల్దార్ అంజిరెడ్డి, ఏసీపీ రమే్‌షకుమార్, ఎస్‌ఐ రజినికర్ లు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బిందుమాదవశర్మ, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, వెంకటరాంరెడ్డి, ప్రవాస భారతీయులు రవి, మల్లిక, నాగవల్లిక ఉన్నారు.