Share News

భక్తి శ్రద్ధలతో ‘ముక్కోటి’ పూజలు

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:44 AM

వైకుంఠ ఏకాదశి పూజలను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

భక్తి శ్రద్ధలతో ‘ముక్కోటి’ పూజలు
భువనగిరి: స్వర్ణగిరి ఆలయంలో తులాభారంలో పాల్గొన్న మాజీ మంత్రి జానారెడ్డి

ఆంధ్రజ్యోతి-న్యూ్‌సనెట్‌వర్క్‌: వైకుంఠ ఏకాదశి పూజలను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వైష్ణవ ఆలయాలన్నీ భక్తజనంద్రంగా మారాయి. పలు ఆలయాల్లో శ్రీమహావిష్ణువు ఉత్తరద్వార దర్శనం ఇచ్చారు. భువనగిరిలోని స్వర్ణగిరి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, స్వర్ణగిరిలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. మాజీ మంత్రి జానారెడ్డి తులాభారంతో మొక్కు చెల్లించుకున్నారు. ఆలయాన్ని విద్యుద్దీపాలు, పండ్లు, పూలతో విశేష రీతిన అలంకరించారు. ఆలయాన్ని సందర్శించిన భక్తులందరికీ అన్నప్రసాదం అందించారు. ఆలయ ధర్మకర్తలు మానెపల్లి మురళి కృష్ణ, గోపికృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు కొనసాగాయి. అలాగే పట్టణంలోని దోవింద క్షేత్రం, శ్రీ సీతారామాంజనేయ స్వామి, దివ్య మురళీకృష్ణ ఆలయం, కన్యకాపరమేశ్వరీతో పాటు అన్ని ఆలయాల్లో భక్తులు వైకుంఠద్వార దర్శనం చేసుకున్నారు. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి శివారులోని రమణేశ్వరంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు సిద్దగురు రమణానంద మహర్షి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి.

Updated Date - Jan 11 , 2025 | 12:44 AM