Share News

రోజూ కళాశాలకు రావాలి

ABN , Publish Date - Jan 02 , 2025 | 11:45 PM

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచడం కోసం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకులు వినూత్నంగా వ్యవహరించారు.

రోజూ కళాశాలకు రావాలి
విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి కళాశాలకు రావాలని ఆహ్వానిస్తున్న అధ్యాపకులు

గైర్హాజరవుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పుష్పగుచ్చాల అందజేత

నేరేడుచర్ల, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచడం కోసం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకులు వినూత్నంగా వ్యవహరించారు. గరిడేపల్లి, పొనుగోడు, అబ్బిరెడ్డిగూడెం గ్రామాలకు చెందిన విద్యార్థులు కళాశాల గైర్హాజరవుతున్నారు. దీంతో అధ్యాపకులే గురువారం విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పుష్పగుచ్చాలు ఇచ్చి ప్రతిరోజూ హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా సీనియర్‌ అధ్యాపకుడు మద్దిమడుగు సైదులు మాట్లాడుతూ పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ కళాశాల బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల హాజరు శాతం పెరిగితే ఉత్తీర్ణత శాతం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో కర్నాటి శ్రీనివాస్‌, ప్రసాద్‌, నర్సింహాచారి, అపర్ణ పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 11:45 PM