Share News

ఎస్‌ఐ దాడి చేశాడని స్టేషన ఎదుట నిరసన

ABN , Publish Date - Jan 02 , 2025 | 12:19 AM

ఇంటి ముందు కూర్చుని మిత్రులతో కలిసి మద్యం తాగుతున్న తనను నూతనకల్‌ ఎస్‌ఐ అకారణంగా స్టేషనకు తీసుకువెళ్లి కొట్టారని యువకుడు ఆరోపించాడు.

ఎస్‌ఐ దాడి చేశాడని స్టేషన ఎదుట నిరసన
పోలీస్‌స్టేషన ఆవరణలో బాధితుడు రాము

నూతనకల్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ఇంటి ముందు కూర్చుని మిత్రులతో కలిసి మద్యం తాగుతున్న తనను నూతనకల్‌ ఎస్‌ఐ అకారణంగా స్టేషనకు తీసుకువెళ్లి కొట్టారని యువకుడు ఆరోపించాడు. మంగళవారం రాత్రి సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో ఈ సంఘటన జరిగింది. బాధితుడు, మండల కేంద్రానికి చెందిన కాటూరి రాము తెలిిపిన వివరాలిలా ఉన్నాయి. నూతనకల్‌కు చెందిన రాము కుటుంబసభ్యులు చర్చీకి వెళ్లేందుకు సిద్ధంకాగా, ఇంటి ముందు మిత్రులతో కలిసి కూర్చుని మద్యం తాగుతున్నాడు. పెట్రోలింగ్‌ చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి రాగా, రాముకు వారి మధ్య వాగ్వివాదం జరిగింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మహేంద్రనాధ్‌ ఘటనా స్థలానికి వచ్చి తనను రక్షక్‌ వాహనంలో పోలీసు స్టేషనకు తీసుకువెళ్లి 15నిమిషాల పాటు విచక్షణారహితంగా కొట్టారని తెలిపాడు. రాత్రి మొత్తం పోలీస్‌ స్టేషనలోనే ఉంచి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని తెలిపాడు. కుటుంబ సభ్యులు స్టేషన వద్ద నిరసన వ్యక్తంచేసి, ఈ ఉదంతాన్ని సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేయడంతో సంఘటన వైరల్‌ అయింది. దీంతో సీఐ శ్రీనునాయక్‌ రామును స్టేషనకు పిలిపించి మాట్లాడారు. ఈ విషయమై ఎస్‌ఐ మహేంద్రనాథ్‌ను వివరణ కోరగా పెట్రోలింగ్‌కు వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లపై మధు దౌర్జాన్యంగా వ్యవహరించాడన్నారు. కానిస్టేబుళ్లు ఫోన ద్వారా తనకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లిన తనపై కూడా దౌర్జన్యం చేశారన్నారు. దీంతో రామును పోలీస్‌స్టేషనకు తీసుకువెళ్లామని, అక్కడ కూడా రాము తనపై దౌర్జన్యంగా వ్యవహరించడంతో కానిసేబుళ్లు అతనిపై చేయిచేసుకున్నారని తెలిపారు.

Updated Date - Jan 02 , 2025 | 12:19 AM