Share News

ఇలపై హరివిల్లు

ABN , Publish Date - Jan 06 , 2025 | 01:30 AM

ఇలపై హరివిల్లు వెలిసిం ది. మహిళామణుల మునివేళ్లనుంచి జాలువారిన తీరొక్క చుక్క.. అందమైన రంగవల్లిగా రూపుదిద్దుకొని చూడముచ్చటగా మంత్రముగ్ధు ల్ని చేసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా.. సామాజిక అంశాల ఇతివృత్తాలను మేళవిస్తూ మహిళలు వేసిన చుక్కల ముగ్గులు ఆకట్టుకున్నాయి.

ఇలపై హరివిల్లు

ఆకట్టుకున్న ముత్యాల ముగ్గుల పోటీలు

ఉత్సాహంగా ముగ్గులు వేసిన మహిళలు

జిల్లాలో వైభవంగా పోటీలు

సంస్కృతీసంప్రదాయాలు...సామాజిక అంశాల మేళవింపు

(ఆంధ్రజ్యోతి, విలేకరుల బృందం-యాదాద్రి): ఇలపై హరివిల్లు వెలిసిం ది. మహిళామణుల మునివేళ్లనుంచి జాలువారిన తీరొక్క చుక్క.. అందమైన రంగవల్లిగా రూపుదిద్దుకొని చూడముచ్చటగా మంత్రముగ్ధు ల్ని చేసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా.. సామాజిక అంశాల ఇతివృత్తాలను మేళవిస్తూ మహిళలు వేసిన చుక్కల ముగ్గులు ఆకట్టుకున్నాయి. ఆదివారం జిల్లా కేంద్రం లో ‘‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ నిర్వహిస్తున్న సంతూర్‌ ము త్యాల పోటీలు... గార్డెనింగ్‌ పార్ట్‌నర్‌ క్రాఫ్ట్‌వారి పెర్‌ఫెక్ట్‌.. ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగిసెల్‌ వారి సెల్సియా(ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌)... వీరభద్ర షాపింగ్‌ మాల్‌’’ సహకారంతో భువనగిరి జాగృతి డిగ్రీ, పీజీ కళాశాల ఆవరణలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా... సంక్రాం త్రి పండుగను వర్ణించే విధంగా మహిళలు రంగవల్లులు తీర్చిదిద్దారు. చుక్కల ముగ్గులు వేసి, పలు రకాల రంగులు అద్ది... పాడి పంటలు ప్రతిబింబించేలా.. నవధాన్యాలను గురుగుల్లో నింపి, ముగ్గుల్లో అలంకరించారు. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుంచి 111 మంది మహిళలు వచ్చి ముగ్గుల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. యాదగిరిగుట్ట ఆలయ ఈవో ఎ.భాస్కర్‌రావు, తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్ల సంఘం రాష్ట్ర కోశాధికారి, జాగృతి కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ మణిపాల్‌రెడ్డి, కౌన్సిలర్‌ జిట్టా వేణుగోపాల్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ పోతంశెట్టి మంజుల, స్పాన్సర్‌ రాచమల్లు వినోద్‌ బహుమతులు అందజేశారు. భువనగిరి పట్టణంలోని వీరభద్ర షాపింగ్‌ మాల్‌ సహకారంతో బహుమతులను అందజేశారు. విజేతలకు భువనగిరి మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ మాయ దశరథ కన్సొలేషన్‌ బహుమతులను అందజేశారు. భువనగి రి మునిసిపల్‌ కౌన్సిలర్‌ కైరంకొండ వెంకటేష్‌ ముగ్గులను తిలకించారు. ఈ పోటీలకు పీఎస్‌.మీరా, డి.నిర్మల, బి.జ్యోతి, సీత న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ‘ఆంధ్రజ్యోతి’ సీనియర్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌ మరాఠి రవి అధ్యక్షతన జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ గంధమల్ల రాజు, వీడియో జర్నలిస్టు బత్తుల మహేష్‌, విలేకరులు కె.నర్సిరెడ్డి, పి.నర్సింహ, పీఎస్‌ కరుణాకర్‌, తాళ్ల భాస్కర్‌, ఖుర్షిద్‌పాషా, రాయగిరి పాండు, గోపే మహేష్‌, ఏబీఎన్‌ రిపోర్టర్‌ గుండేటి హరిబాబు, యాదగిరిగుట్ట ఎస్‌ఆర్‌ నరేష్‌, తదితరులు పాల్గొన్నారు.

ముగ్గులతో మహిళల్లో సృజనాత్మకత వెలుగులోకి.. : భాస్కర్‌రావు

ముత్యాల ముగ్గుల పోటీలతో మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని యాదగిరిగుట్ట ఆలయ ఈవో ఎ.భాస్కర్‌రావు తెలిపారు. జిల్లాస్థాయి ముత్యాల ముగ్గుల పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ముత్యాల ముగ్గుల పోటీ నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. పట్టణీకరణ పెరిగిపోతోన్న ఈ రోజుల్లో సంప్రదాయాలను కూడా మరిచిపోతున్నామని, సంక్రాంతి పండుగ వచ్చిందంటే చిన్నతనంలో సంప్రదాయ ముగ్గులు ఎంతో అద్భుతంగా ఉండేవన్నారు. ఆధునిక కాలంలో వీటిపై యువతకు మక్కువ తగ్గుతోందని, ఇలాంటి తరుణంలో...ముగ్గుల గొప్పదనాన్ని చాటి చెప్పడానికి ప్రతి ఏటా ‘ఆంధ్రజ్యోతి’ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం శుభపరిణామన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళలు వేసినరంగురంగుల ముగ్గులను పరిశీలించి అభినందించారు.

అనూహ్య స్పందన : రాచమల్ల వినోద్‌, స్పాన్సర్‌

ముత్యాల ముగ్గుల పోటీకి అనూహ్య స్పందన వచ్చింది. ఈ పోటీల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం అభినందనీయం. ప్రఽథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు కన్సోలేషన్‌ బహుమతులు అందజేయడమే కాకుండా పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం హర్షనీయం. ఇక్కడ బహుమతులు గెలిచిన వారు రాష్ట్రస్థాయిలోనూ రాణించాలి.

సామాజిక బాధ్యతగా ముగ్గుల పోటీలు: ఉపేందర్‌రెడ్డి

‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ సామాజిక బాధ్యతగా ముగ్గుల పోటీలు నిర్వహించడం శుభప్రదమని టీజీవోల రాష్ట్ర కోశాధికారి మందడి ఉపేందర్‌రెడ్డి తెలిపారు. నగరాల్లో అపార్టుమెంట్‌ కల్చర్‌ రావడంతో ముగ్గులు వేసేందుకు స్థలం కరువైందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ పండుగ సందర్భంగా సంస్కృతీ,సంప్రదాయాలు ఉట్టిపడేలా ముగ్గులు వేస్తున్నారని మహిళలను అభినందించారు. మహిళలు వేసిన ముగ్గుల్లో మేథో సంపత్తి, ఆలోచనలు, వారి మనోభావాలు ప్రతిబింబిస్తాయన్నారు. సంప్రదాయాలను కాపాడటంలో ‘ఆంధ్రజ్యోతి’ కృషి చేస్తుందని, యాజమాన్యానికి ధన్యవాదాలన్నారు.

సంప్రదాయాలను కాపాడుతున్న ఆంధ్రజ్యోతి: మణిపాల్‌రెడ్డి

సంక్రాంత్రి ముగ్గుల పోటీలను ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ నిర్వహించడం శుభకరమని, ఈ పోటీలకు ప్రతిఏటా ఆదరణ పెరుగుతోందని జాగృతి కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ మణిపాల్‌రెడ్డి అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి రెట్టింపు స్థాయిలో మహిళలు పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహిస్తున్న ఈ పోటీలతో మహిళల్లో సృజనాత్మకతను పెంపొందుతుందన్నారు. ప్రతి ఏటా తమ కళాశాల ప్రాంగణంలోనే ముగ్గుల పోటీలు నిర్వహించడం సంతోషమని, సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు ‘ఆంధ్రజ్యోతి’ కృషి చేస్తుందన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 01:30 AM