Share News

సావిత్రీబాయి పూలే ఆశయాలు సాధించాలి

ABN , Publish Date - Jan 03 , 2025 | 11:56 PM

సావిత్రీబాయి పూలే ఆశయాలు సాధించాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి కలెక్టర్‌ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు జి.వీరారెడ్డి, గంగాధర్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సావిత్రీబాయి పూలే ఆశయాలు సాధించాలి

కలెక్టర్‌ హనుమంతరావు

భువనగిరి (కలెక్టరేట్‌), జనవరి 3(ఆంధ్రజ్యో తి): సావిత్రీబాయి పూలే ఆశయాలు సాధించాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి కలెక్టర్‌ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు జి.వీరారెడ్డి, గంగాధర్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ సామాజిక మార్పునకు, లింగ సమానత్వానికి విద్యనే ఆయుధమని భావించి విద్యావ్యాప్తికి అత్యంత కృషి చేసిన మహనీయురాలు సావిత్రీబాయి పూలే అన్నారు.

అన్ని వర్గాలకు విద్యావకాశాలు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించి విద్యావిప్లవంతో చరిత్రలో నిలిచారన్నారు. కార్యక్రమంలో గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోశాధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి కే.సత్యనారాయణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి.నాగిరెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఎం.మనోహర్‌, ఎస్సీ సంక్షేమాధికారి శ్యాంసుందర్‌, బీసీ సంక్షేమాధికారి యాదయ్య, ఏవో జగన్‌మోహన ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు శుభాకాంక్షల వెల్లువ

కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వివిధ శాఖల జిల్లా అధికారులతోపాటు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులతో శుక్రవారం కలెక్టరేట్‌ ప్రాంగణం సందడిగా మారింది. కార్యక్రమంలో భువనగిరి జోన్‌ డీసీపీ రాజేష్‌ చంద్ర, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్‌, ఆర్డీవో కృ ష్ణారెడ్డి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సైదులు, డీఈ వో కే.సత్యనారాయణ, డీఆర్‌డీవో నాగిరెడ్డి, కలెక్టరేట్‌ ఏవో జగన్‌మోహన్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 12:01 AM