Share News

‘సాగర్‌’లో రెండో నెంబర్‌ టర్బైన సిద్ధం

ABN , Publish Date - Jan 09 , 2025 | 12:07 AM

నల్లగొండ జిల్లా జిల్లా నాగార్జునసాగర్‌ ప్రధాన జలవిద్యుత కేంద్రంలోని రెండో నెంబరు టర్బైన మరమ్మతులు పూర్తయ్యాయి.

‘సాగర్‌’లో రెండో నెంబర్‌ టర్బైన సిద్ధం

రూ. 30లక్షలతో మరమ్మతులు

పనులు పూర్తి చేసిన జపాన ఇంజనీర్లు

నాగార్జునసాగర్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా జిల్లా నాగార్జునసాగర్‌ ప్రధాన జలవిద్యుత కేంద్రంలోని రెండో నెంబరు టర్బైన మరమ్మతులు పూర్తయ్యాయి. జలవిద్యుత కేంద్రంలో మొత్తం ఎనిమిది టర్బైన్లు ఉండగా, గత ఏడాది రెండో నంబరు టర్బైనలోని రూటర్‌ స్పైడర్‌ మరమ్మతులకు లోనైంది. గత ఏడాది ఆగస్టులో సాగర్‌ ప్రాజెక్టుకు భారీ వరదలు రావడంతో ప్రాజెక్టు వారం రోజుల్లో పూర్తిస్థాయికి చేరుకుంది. నిండా నీళ్లున్నా రెండో నెంబర్‌ టర్బైన విద్యుదుత్పత్తికి వినియోగించకపోవడంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబరు నెలలో ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్‌ ప్రధాన జలవిద్యుత కేంద్రాన్ని పరిశీలించి, మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని జెనకో అధికారులను ఆదేశించారు. నవంబరులో జపాన నుంచి టెక్నికల్‌ ఇంజనీర్లు రాగా, మరమ్మతుల పనులను ప్రారంభించి, పూర్తిచేశారు. బుధవారం నుంచి రెండో నంబరు టర్బైన నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభమైంది.

నెలన్నర రోజుల శ్రమించి మరమ్మతులు పూర్తి చేశాం: మంగేష్‌కుమార్‌, జెనకో సీఈ

సాగర్‌ ప్రధాన జల విద్యుత కేంద్రంలో మరమ్మతులకు గురైన రెండో నంబరు టర్బైనను నెలన్నర రోజుల పాటు శ్రమించి పూర్తి చేశాం. ఇందుకు రూ. 30లక్షలు ఖర్చు అయింది. ప్రస్తుతం ప్రధాన జలవిద్యుత కేంద్రంలో ఉన్న 8 టర్బైన్ల ద్వారా పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నాం.

Updated Date - Jan 09 , 2025 | 12:07 AM