డిమాండ్లు నెరవేర్చే వరకూ సమ్మె
ABN , Publish Date - Jan 02 , 2025 | 11:47 PM
సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకూ సమ్మె కొనసాగిస్తామని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
సూర్యాపేట(కలెక్టరేట్), జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకూ సమ్మె కొనసాగిస్తామని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు గురువారం కలెక్టరేట్ ఎదుట నుంచి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. సుమారు 20 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నా రెగ్యులర్ చేయకపోవడం సమంజసరికాదన్నారు. సమ్మెతో విద్యాశాఖలో నిర్వ హణ పూర్తిగా నిలిచిపోయిందన్నారు. ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజీ కల్పించాలన్నారు. ఎన్నికల సమయంలో సమగ్రశిక్ష ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలుపర్చాలన్నారు. ప్లకార్డులను చేతపట్టుకుని పాల్గొన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకులు వెంకటరమణ, సయ్యద్, లక్ష్మీనారాయణ, హరిత, జానయ్య. హరిత, తేజశ్రీ, వీణ, రాంబాబు, శ్రీధర్, పెండెం శ్రీనివాస్, సుదర్శన, నవీన, అంజి, సోమేష్, అరుణ, శరీన, విజయకుమారి, కవిత పాల్గొన్నారు.