Share News

Suryapeta: బాబోయ్.. ఇలా తయారయ్యారేంటి.. యువతికి మద్యం తాగించి ఆపై..

ABN , Publish Date - Mar 20 , 2025 | 07:55 AM

హుజూర్ నగర్ పట్టణానికి చెందిన హరీశ్, ప్రమోద్ అనే ఇద్దరు కామాంధులు.. ఓ యువతి సహాయంతో బాధితురాలితో స్నేహం పెంచుకున్నారు. నలుగురూ కలిసి సినిమాలు, షికార్లకు తిరిగారు. ఇద్దరు యువకులూ మంచి వాళ్లగా నటించడంతో సదరు యువతి మోసపోయింది.

Suryapeta: బాబోయ్.. ఇలా తయారయ్యారేంటి.. యువతికి మద్యం తాగించి ఆపై..
Huzurnagar

సూర్యాపేట: తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, చిన్నారులపై వరస దాడులు తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. అత్యాచారాలు, హత్యాచారాలు చేస్తూ కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇల్లు, ఆఫీసుల్లోనూ మహిళలకు భద్రత కరవైపోతోంది. వందల మంది నేరస్థులను పోలీసులు, కోర్టులు కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ ప్రతి రోజూ కొత్తకొత్త నేరాలు జరుగుతూనే ఉన్నాయి, కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. మరోవైపు పాఠశాలలకు వెళ్తున్న బాలికలను సైతం ఎత్తుకెళ్లిపోయి అత్యాచారాలు చేస్తున్నారు కామాంధులు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.


హుజూర్‌నగర్‌లో ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. స్నేహంగా నటిస్తూ ఆమెకు మద్యం తాగించి మరీ దారుణానికి ఒడికట్టారు. ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ శారీరకంగా, మానసికంగా హింసించారు. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన హరీశ్, ప్రమోద్ అనే ఇద్దరు కామాంధులు.. ఓ యువతి సహాయంతో బాధితురాలితో స్నేహం పెంచుకున్నారు. నలుగురూ కలిసి సినిమాలు, షికార్లకు తిరిగారు. ఇద్దరు యువకులూ మంచి వాళ్లగా నటించడంతో సదరు యువతి మోసపోయింది. ఓ రోజు పార్టీ చేసుకుందామని చెప్పిన యువతి, యువకులు.. బాధితురాలని హుజూరాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయ సమీపానికి తీసుకెళ్లారు. స్నేహం ముసుగులో బలవంతంగా ఆమెకు మద్యం తాగించారు.


ఆపై మత్తులో ఉన్న సదరు యువతిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలోనే బాధితురాలి ప్రైవేటు వీడియోలు, ఫొటోలు తీశారు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి ఇంటి వద్ద వదిలిపెట్టారు. అయితే ప్రైవేటు వీడియోలు తీసిన కామాంధులు బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. తాము ఫోన్ చేసి పిలిచినప్పుడల్లా రావాలని, అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు. రాకపోతే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ భయపెట్టారు. అయినా వారు అడిగింది చేసేందుకు ఆ యువతి నిరాకరించింది. దీంతో ఇద్దరూ కలిసి ఆమెపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. తీవ్రగాయాలు కావడంతో వేధింపులు తట్టుకోలేని పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయం మెుత్తం వివరించింది. దీంతో ఇద్దరు యువకులు, వారికి సహకరించిన మరో యువతిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Telangana Budget: రవాణా శాఖకు రూ. 4,485 కోట్లు

Kalvakuntla Kavitha: పవచనాలు ఎక్కువ.. పైసలు తక్కువ: కవిత

Updated Date - Mar 20 , 2025 | 08:51 AM