Share News

జిల్లా ఉత్తమ మహిళా రైతుగా వెంకటమ్మ

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:12 AM

నల్లగొండ జిల్లా ఉత్తమ మహిళా రైతుగా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన పోలగోని వెంకటమ్మ ఎంపికయ్యారు.

జిల్లా ఉత్తమ మహిళా  రైతుగా వెంకటమ్మ
అవార్డుతో మహిళా రైతు పోలగోని వెంకటమ్మ

హైదరాబాద్‌లో అందజేసిన మంత్రి సీతక్క

చిట్యాల రూరల్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా ఉత్తమ మహిళా రైతుగా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన పోలగోని వెంకటమ్మ ఎంపికయ్యారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ధనసరి సీతక్క ఈ అవార్డును వెంకటమ్మకు అందజేశారు. సన్మానించి, మెమోంటోను అందజేశారు. 1992 నుంచి వెంకటమ్మ వ్యవసాయం చేస్తోంది. ఆమె ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జిల్లా నుంచి ఉత్తమ మహిళా రైతుగా ఎంపిక చేసింది.

Updated Date - Jan 04 , 2025 | 12:12 AM