Share News

BJP: రాజాసింగ్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు

ABN , Publish Date - Mar 21 , 2025 | 05:03 AM

భద్రతా కారణాల రీత్యా ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని వాడాలని, భద్రతా సిబ్బందిని ఉపయోగించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్‌ను పోలీసులు కోరారు.

BJP: రాజాసింగ్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు

  • వాడుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేకు పోలీసుల నోటీసులు

  • భద్రత కోసమేనని వెల్లడి

అఫ్జల్‌గంజ్‌/ మంగళ్‌హాట్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): భద్రతా కారణాల రీత్యా ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని వాడాలని, భద్రతా సిబ్బందిని ఉపయోగించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్‌ను పోలీసులు కోరారు. ఈ మేరకు ఆయనకు ఈ నెల 19న హైదరాబాద్‌లోని మంగళ్‌హట్‌ పోలీసులు నోటీసు జారీ చేశారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రభుత్వం కేటాయించిన 1+4 భద్రతా సిబ్బందిని, బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని వినియోగించాలని కోరారు. రాజాసింగ్‌ భద్రతను దృష్టిలో పెట్టుకుని సాధారణ భద్రతా చర్యల్లో భాగంగా నోటీసు జారీ చేశామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటానికే ద్విచక్ర వాహనంపై తిరిగేందుకు ప్రాధాన్యం ఇస్తానన్నారు.


గోషామహల్‌లో ఇరుకైన రోడ్లు, కాలనీలు, వ్యాపార సముదాయాలు ఉండటంతో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంపై వెళ్లడం తనకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. అయితే, తనకు భద్రత అవసరమని, అందుకు తుపాకీ లైసెన్స్‌ కావాలని కోరినప్పుడు నిరాకరించిన పోలీసులు.. కేసులు ఎదుర్కొంటున్న పలువురు వ్యక్తులకు తుపాకీ లైసెన్సులు మంజూరు చేశారని ఆరోపించారు. ఇది వ్యవస్థలో గల ద్వంద్వ ప్రమాణాలను బయట పెడుతున్నదని అన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 05:03 AM