Ponguleti: ప్రకటనల పేరుతో బీఆర్‌ఎస్ దోపిడీ
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:17 AM
ప్రకటనల పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాఽధనాన్ని సొంత మీడియాకు ధారాదత్తం చేసిందని సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

సొంత మీడియాకు ప్రజాధనం ధారాదత్తం
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీన్యూస్‌కు దోచిపెట్టారు : పొంగులేటి
హైదరాబాద్, మార్చి26(ఆంధ్రజ్యోతి): ప్రకటనల పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని సొంత మీడియాకు ధారాదత్తం చేసిందని సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. బుధవారం అసెంబ్లీలో సమాచార శాఖ పద్దులపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడారు. బీఆర్‌ఎస్ సొంత మీడియా సంస్థలైన నమేస్త తెలంగాణ, తెలంగాణ టుడే, టీన్యూస్ లకు ఎంత ఖర్చు పెట్టారన్న దానిపై బహిరంగ చర్చకు సిద్థమన్నారు.
ఇతర రాష్ర్టాలలో సొంత ప్రచారానికి 564 కోట్లు
బీఆర్‌ఎస్ నేతలు పదేళ్ల పాలనలో రూ.564.40 కోట్లు తెలంగాణేతర రాష్ర్టాలలో ఖర్చు చేసి పేదల సొమ్మును సొంత ప్రచారానికి వాడుకున్నారని పొంగులేటి తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటనల పేరిట చేసిన దుర్వినియోగాన్ని మంత్రి సభ దృష్టికి తీసుకొచ్చారు. 2014లో ప్రారంభమైన నమేస్త తెలంగాణ పత్రికకు కాలం సెంటీమీటర్‌కు టారిఫ్ రూ.875గా ఉండేదని, తర్వాత 2016లో అది రూ. 1150కు చేరిందని, 2019లో రూ.1500కు పెంచేశారని తెలిపారు. ఇదే సమయంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ఈనాడు పత్రిక టారిఫ్ రూ. 1500గా ఉందని, దీన్ని బట్టి ప్రజాధనం ఏవిధంగా గత పాలకులు దుర్వినియోగం చేశారో అర్థమవుతుందన్నారు. ఇక తెలంగాణ టుడే అనే వారి సొంత ఆంగ్ల పత్రికకు 2017లో కాలం సెంటీమీటర్ రూ.1000 ఉండగా, కేవలం 2 ఏళ్ల వ్యవధిలో 2019లో ఈ రేటును రూ.2000కు పెంచారని ఇదే సమయంలో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక టారిఫ్ రూ.1000 మాత్రమే ఉన్నదని మంత్రి వివరించారు. ఇక్కడ కూడా దోపిడీ జరిగిందన్నారు. ఇక టీవీ ప్రకటనల విషయానికి వేస్త టీ ఛానల్‌కు సెకనుకు రూ.3000 ధర నిర్ణయించారని అదే ఈటీవీకి రూ.2500, ఎన్‌టీవీకి రూ.3000 ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16నెలల వ్యవధిలో సుమారు రూ.200 కోట్లు ఖర్చు చేసిందని పొంగులేటి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..
GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు
Read Latest Telangana News And Telugu News