Share News

Crime News: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్.. కలకలం రేపిన గ్యాంగ్ వార్

ABN , Publish Date - Apr 01 , 2025 | 08:45 AM

ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, కమలాపురం పట్టణంలో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముగ్గురు యువకులపై సల్మాన్ అనే యువకుడు కత్తితో దాడి చేసాడు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

Crime News: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్.. కలకలం రేపిన గ్యాంగ్ వార్
Telugu States Crime News

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) నేరాలను (Crime) అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా.. నేరగాళ్లు (Criminals)_మారడంలేదు. తాజాగా తెలంగాణ (Telangana)లోని వికారాబాద్ జిల్లా (Vikarabad Dist.), పరిగిలో గ్యాంగ్ వార్ (Gang War) కలకలం రేపింది. పోలీసు స్టేషన్‌కు కూత వేటు దూరంలో యువకులు రచ్చ రచ్చ చేశారు. ఓ ఛాయ్ హోటల్లో ఒకరిపై ఒకరు కూల్ డ్రింక్స్ బాటిళ్లు విసురుకున్నారు. బూతులతో తిట్టుకుంటూ పెద్దగా అరుస్తూ గోల గోల చేశారు. యువకుల హంగామాతో చుట్టుపక్కల కాలనీవాసులు భయబ్రాంతులకు గురయ్యారు. వారి మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఓ గొడవ గురించి మాట్లాడుకునేందుకు హోటల్ వద్దకు వెళ్ళి రచ్చ రచ్చ చేశారు. మాట్లాడేందుకు పిలిచి తమపై దాడి చేశారని ఓ వర్గానికి చెందిన యువకులు ఆరోపించారు. పోలీసులు కూడా వారికే సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. యువకుల వీరంగమంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read..: ప్రియుడిఫై కోపంతో ఆ మహిళ ఏంచేసిందంటే..


మరో ఘటన ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, కమలాపురం పట్టణంలో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముగ్గురు యువకులపై సల్మాన్ అనే యువకుడు కత్తితో దాడి చేసాడు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. మోటర్ బైక్ స్పీడ్‌గా నడుపు తున్నాడని సల్మాన్‌ను సోహెల్, రియాజ్, షా బాజ్‌లు మందలించారు. తనకే నీతులు చెబుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సల్మాన్ కత్తితో వారిపై దాడి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎస్ఆర్‌హెచ్‌ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ

నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు

For More AP News and Telugu News

Updated Date - Apr 01 , 2025 | 08:45 AM