Hyderabad: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..
ABN , Publish Date - Jan 04 , 2025 | 07:25 AM
తెలంగాణ: ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఇవాళ(శనివారం) ఉదయం ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
హైదరాబాద్: ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు (Airplane accidents) తీవ్ర కలకలం రేపుతున్నాయి. సాంకేతిక సమస్యలు (Technical issues), ఇతర కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఇవాళ(శనివారం) ఉదయం ముంబై నుంచి విశాఖపట్నం (Mumbai to Visakhapatnam) వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo flight)లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సాంకేతిక సమస్యను సకాలంలో గుర్తించిన పైలట్.. విమానాన్ని హైదరాబాద్ వైపునకు మళ్లించారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో మెుత్తం 144 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం క్షేమంగా దిగడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, దక్షిణ కొరియాలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెజు ఎయిర్ సంస్థకు చెందిన విమానం రన్‌వేపై దిగుతూ వేగంగా ముందుకు దూసుకెళ్లి ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టింది. ఒక్కసారిగా పేలిపోవడంతో 181 మంది ప్రయాణికుల్లో ఏకంగా 179 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఇద్దరు మాత్రమే బయటపడగలిగారు. ఈ ఘటన ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల్లో ఆందోళన పెరిగిపోతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: వణికిస్తున్న చలి.. పటాన్‌చెరులో అత్యల్పం
Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట