Apsara Murder Case: తెలంగాణలో కలకలం రేపిన అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు
ABN , Publish Date - Mar 26 , 2025 | 02:44 PM
Apsara murder case: తెలంగాణలో సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది కోర్టు.

రంగారెడ్డి కోర్టు, మార్చి 26: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో యువతి అప్సర హత్య కేసులో రంగారెడ్డి కోర్టు (Rangareddy) కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు సాయి కృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. సాక్షాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్లు అదనపు జైలు శిక్ష విధించింది. అప్సరను నాలుగేళ్ల పాటు ప్రేమ కలాపాలు జరిపాడు సాయి కృష్ణ. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి తీసుకురావడంతో ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. శంషాబాద్‌లో అప్సరను చంపి కారులో తీసుకువచ్చి మ్యాన్‌హోల్‌లో పడేశాడు.
సరూర్‌నగర్‌లో అప్సరను హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శంషాబాద్ నుంచి అప్సరను కారులో తీసుకెళ్లిన సాయి కృష్ణ అక్కడ ఆమెను చంపేసి తిరిగి సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మ్యాన్‌హోల్‌లో పడేశాడు. ఈ కేసులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. అలాగే పోలీసులు కూడా త్వరగానే చార్జ్‌షీట్‌ను కూడా ఫైల్ చేశారు. నాలుగేళ్లపాటు అప్సరతో ప్రేమాయణం సాగించిన నిందితుడు పెళ్లి ఊసెత్తడంతో ఆమెను ఒక పథకం ప్రకరామే హత్య చేశాడు సాయికృష్ణ. నిందితుడు సాయికి సంబంధించి సుదీర్ఘ వాదనల తర్వాత రంగారెడ్డి కోర్టు పూజారికి జీవిత ఖైదు విధించింది. అలాగే సాక్షాలను తారుమారు చేశారంటూ మరో ఏడేళ్లపాటు సాయికృష్ణకు శిక్షను విధించింది కోర్టు.
Pastors Death Controversy: పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణకు సీఎం ఆదేశం..
ఈ కేసులో రెండు వేర్వేరు అంశాలపై విచారణ సాగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఎట్టకేలకు నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేసే వెసులుబాటు ఉంటుంది. కానీ ప్రస్తుతం సాయి హైకోర్టును ఆశ్రయిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. రంగారెడ్డి కోర్టు ఇటీవల కాలంలో సంచలనమైన కేసుల్లో జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిస్తోంది. ఈ కేసుతో కలిపి మొత్తం మూడు కేసుల్లో నిందితులకు కోర్టు జీవిత ఖైదును విధించింది. టెక్నికల్ ఎవిడెన్స్‌తో పాటు సాక్షుల స్టేట్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని అప్సర హత్య కేసులో సాయికృష్ణకు శిక్షను ఖరారు చేసింది రంగారెడ్డి కోర్టు.
ఇవి కూడా చదవండి...
Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే
Case On KTR: కేటీఆర్ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్
Read Latest Telangana News And Telugu News