Home » Apsara Murder Case
Apsara murder case: తెలంగాణలో సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది కోర్టు.
సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి సాయికృష్ణను కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సాయికృష్ణతో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశం, శంషాబాద్ బస్టాండ్ ఏరియాలో పరిశీలించారు. ఈ కేసులో సాయికృష్ణ రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైలులో ఉన్నారు.
అప్సర కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. అప్సరకు ఇప్పటికే పెళ్లయినట్లు సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అప్సరను చూసి చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కార్తీక్ రాజా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్సర హత్య తర్వాత కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఒక ఆడియోను విడుదల చేశారు.
హైదరాబాద్ సరూర్‌నగర్‌లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గంటకో ట్విస్ట్.. రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తుండటంతో అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఇదే బర్నింగ్ టాపిక్ అయ్యింది...
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో (Apsara Murder Case) గంటకో సంచలన విషయం వెలుగు చూస్తోంది. ఇప్పటికే పలు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఊహించని విషయాలు, ట్విస్ట్‌లు బయటపెట్టగా.. ఇప్పుడంతా అప్సర మొదటి పెళ్లి (Apsara Marriage) గురించే చర్చ నడుస్తోంది...
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్‌నగర్ అప్సర హత్య (Apsara Muder Case) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..
హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని అప్సర హత్య కేసు (Apsara Murder Case) పెను సంచలనమైంది. నగరంలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఈ హత్య గురించే చర్చించుకునేంత పరిస్థితి..
మూడు నెలల నుంచి అప్సర తన కొడుకుని వేధిస్తోందని పూజారి సాయి కృష్ణ తండ్రి మీడియాకు తెలిపారు. సాయికృష్ణ, అప్సరలకు సంబంధించిన పలు విషయాలను సాయికృష్ణ తండ్రి వెల్లడించారు. పిల్లలు ఉన్నా పెళ్లి చేసుకోవాలని తన అబ్బాయిని ఇబ్బంది పెట్టిందన్నారు. దీంతో సాయి కృష్ణ ఏం చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నాడన్నారు.
పూజారి సాయికృష్ణ చేతిలో అప్సర అతి కిరాతకంగా హత్యకు గురవడంపట్ల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
అప్సర గర్భం విషయమై నిందితుడు సాయికృష్ణ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తానెప్పుడూ అప్సరను శారీరకంగా కలవలేదని తెలిపాడు. చెన్నైకు చెందిన బాయి ఫ్రెండ్‌తో అప్సరకు సంబంధం ఉందని వెల్లడించాడు. జనవరిలోనే తన గర్భం గురించి అప్సర చెప్పిందని సాయి కృష్ణ తెలిపాడు. తాను 3 నెలల గర్భవతిని అని జనవరిలో అప్సర చెప్పిందని.. అప్పుడే ఆమెపై అనుమానపడినట్టు సాయికృష్ణ వెల్లడించాడు.