Home » Court
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లక్నోలోని స్థానిక కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 10న హాజరుకావాలని ఆదేశించింది.
మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై నాంపల్లిలోని ప్రజా ప్రతినిదుల కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున కుటుంబం మానసికంగా కుంగిపోయిందని అన్నారు.
2017 మార్చి 4న ఇద్దరు యువకులు ప్రముఖ వ్యాపారవేత మనీష్ జైన్ కార్యాలయానికి వచ్చి అతని కాల్చిచంపేందుకు ప్రయత్నించారు. అయితే రివాల్వర్లోనే బుల్లెట్ ఉండిపోవడంతో మనీష్ జైన్ ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం ఆయన లారెన్స్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు తనను చంపేందుకు ప్రయత్నించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రజల దశాబ్దాల కల సాకారం అవుతుంది. ప్రజలు ఎదురుచూస్తున్న జిల్లా అదనపు సెషన్స్ కోర్టు రామచంద్రపురంలో ప్రారంభానికి సిద్ధ అయ్యింది. ఈ నెల 10న రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ రామచంద్రపురంలో జిల్లా అదనపు సెషన్స్ కోర్టును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దీంతో రామచంద్రపురం పరిసర మండలాల ప్రజలు, కక్షిదారులు, న్యాయవాదులకు జిల్లా కోర్టు బెంచి ద్వారా న్యాయసేవలు చేరువ కానున్నాయి
2015 జులై 14న నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ కారణంగా తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు యువతి సూసైడ్ నోట్ రాసింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు ఆమె లేఖలో పేర్కొంది.
మంత్రి కొండా సురేఖకు నాంపల్లిలోని ప్రజా ప్రతినిదుల కోర్టులో బిగ్ షాక్ తగిలింది. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున తీవ్రంగా ఖండించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపాయి. కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ అక్కినేని ఫ్యామిలీని కూడా మంత్రి కొండా సురేఖ ప్రస్తావనకు తీసుకువచ్చారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ అలవాటు అని ఆరోపించారు. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే అని, కేటీఆర్‌కు తల్లి అక్క, చెల్లి లేరా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా పడింది.
పోలీస్ స్టేషన్లో సీనియర్ అధికారి కార్యాలయాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూ కోసం గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ స్టూడియోగా వాడుకోవడంపై పంజాబ్ హరియాణా హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.