Share News

Indian Army: ఆర్మీలో ఉద్యోగాలు!

ABN , Publish Date - Mar 22 , 2025 | 04:38 AM

భారత ఆర్మీలో అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ (క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌), అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి, మేజర్‌ పీసీ రాయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Indian Army: ఆర్మీలో ఉద్యోగాలు!

హైదరాబాద్‌ సిటీ, మార్చి 21(ఆంధ్రజ్యోతి): భారత ఆర్మీలో అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ (క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌), అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి, మేజర్‌ పీసీ రాయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాల్లో కొన్నింటికి 8వ తరగతి, మరికొన్నింటికి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు.


ఐటీఐ, డిప్లమో, ఎన్‌సీసీ అర్హత ఉన్న అభ్యర్థులకు బోనస్‌ మార్కులు ఉంటాయని చెప్పారు. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ఠీఠీఠీ.్జౌజీుఽజీుఽఛీజ్చీుఽ్చటఝడ.ుఽజీఛి వెబ్‌సైట్‌ ద్వారా ఏప్రిల్‌ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు సికింద్రాబాద్‌లోని రిక్రూటింగ్‌ కార్యాలయం ఫోన్‌ నంబరు 040-27740205 ను సంప్రదించవచ్చని ఆయన చెప్పారు.

Updated Date - Mar 22 , 2025 | 04:38 AM