Sajjanar: బెట్టింగ్ యాప్‌ల జోలికి పోవద్దు
ABN , Publish Date - Mar 17 , 2025 | 03:55 AM
చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాడు. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట.. బుద్ధుందా అసలు.. అంటూ తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్.. యూట్యూబర్ హర్షసాయిపై మండిప డ్డారు.

ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లూయెన్సర్లను అన్‌ఫాలో చేయండి
అమాయకులు బలైపోతుంటే పశ్చాత్తాపం లేదు
యూట్యూబర్ హర్షసాయిపై మండిపడ్డ సజ్జనార్
హైదరాబాద్ సిటీ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ‘చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాడు. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట.. బుద్ధుందా అసలు?’.. అంటూ తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్.. యూట్యూబర్ హర్షసాయిపై మండిప డ్డారు. ‘ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైపో తుంటే కనీసం పశ్చాత్తాపం లేదు. వీళ్లకు డబ్బే ముఖ్యం. డబ్బే సర్వస్వం. ఎవరు ఎక్కడ పోయినా, సమాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్నమైనా సంబంధం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన హర్షసాయి వీడియోను సజ్జనార్ ఎక్స్‌లో పోస్టు చేస్తూ పై విధంగా స్పందించారు. ‘ఈయనకు రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఆఫర్ చేశారట.
అంతగనం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్‌ని మార్కెట్‌లో పెట్టి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్లనా.. మీరు ఫాలో అవుతోంది.. ఒక్కసారి ఆలోచించండి. వెంటనే ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి’.. అంటూ సజ్జనార్ సందేశ్మాక ట్వీట్‌ను పోస్టు చేశారు. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలువురు బెట్టింగ్ యాప్‌లతో ప్రాణాలు తీసుకోగా, వారి కుటుంబాలు చిన్నాభిన్నమైన పరిస్థితులను గుర్తు చేస్తూ ఆయన నేటి యువతరం బెట్టింగ్ యాప్‌ల జోలికి పోవద్దని, ప్రాణాలకు మీదకు తెచ్చుకోవద్దని, కుటుంబాలను రోడ్డుమీద పడవేసుకునేలా చేసుకోవద్దని సూచించారు. కాగా సజ్జనార్ చేసిన ఈ పోస్ట్‌కు పలువురు మద్దతు తెలిపారు.