Share News

సికింద్రాబాద్‌కు రాకుండా మరో 9 రైళ్ల దారి మళ్లింపు

ABN , Publish Date - Mar 16 , 2025 | 05:29 AM

కింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి పనుల నిమిత్తం మరో 9 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

సికింద్రాబాద్‌కు రాకుండా మరో 9 రైళ్ల దారి మళ్లింపు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి పనుల నిమిత్తం మరో 9 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. వీటిలో 4 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను చర్లపల్లి, అమ్ముగూడ, లింగంపల్లి మీదుగా, మరో 5 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను చర్లపల్లి, మౌలాలి బైపాస్‌ మీదుగా కామారెడ్డి వైపు మళ్లించాలని నిర్ణయించినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. ఏప్రిల్‌ 22 నుంచి విశాఖపట్నం-ముంబై-విశాఖపట్నం (20809/20810), మచిలీపట్నం-షిర్డీ-మచిలీపట్నం వీక్లీ (17207/17208), ఏప్రిల్‌ 23 నుంచి కాకినాడ-షిర్డీ-కాకినాడ ట్రై వీక్లీ (17205/17206), మే 9 నుంచి వాస్కోడగామా-జసిదిద్‌-వాస్కోడగామా వీక్లీ (17321/17322) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను చర్లపల్లి, అమ్ముగూడ, సనత్‌నగర్‌ , లింగంపల్లి మీదుగా మళ్లించనున్నట్లు చెప్పారు.


అలాగే ఏప్రిల్‌ 24 నుంచి విశాఖపట్నం-సాయినగర్‌ షిర్డీ- విశాఖపట్నం వీక్లీ (18503/18504), ఏప్రిల్‌ 25 నుంచి నర్సాపూర్‌-నాగర్‌సోల్‌-నర్సాపూర్‌ (12787/12788), సంబల్‌పూర్‌-నాందేడ్‌ ట్రైవీక్లీ (20809/20810), ఏప్రిల్‌ 26 నుంచి విశాఖపట్నం-నాందేడ్‌- విశాఖపట్నం ట్రైవీక్లీ (20811/20812), ఏప్రిల్‌ 28 నుంచి నర్సాపూర్‌-నాగర్‌సోల్‌-నర్సాపూర్‌ బై వీక్లీ (17231/17232) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను చర్లపల్లి, మౌలాలి బైపాస్‌ మీదుగా కామారెడ్డి వైపు మళ్లించనున్నట్లు డీపిఆర్‌ఓ తెలిపారు.

Updated Date - Mar 16 , 2025 | 05:29 AM