Seethakka: అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ హరీశ్‌రావు
ABN , Publish Date - Mar 11 , 2025 | 04:27 AM
అసెంబ్లీ వేదికగా వారి బండారాన్ని బయటపెడతామన్నారు. మహిళా సంఘాల బ్యాంకు రుణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు చెల్లించడం లేదన్న హరీశ్ రావు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళల పట్ల ఆయనది మొసలి కన్నీరు: మంత్రి సీతక్క
హైదరాబాద్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మాజీ మంత్రి హరీశ్ రావు వ్యవహరిస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఆయన మహిళా సంఘాలకు చేసిందేమీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మహిళా సభ విజయవంతం కావడంతో కళ్లల్లో నిప్పులు పోసుకుని అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా వారి బండారాన్ని బయటపెడతామన్నారు.
మహిళా సంఘాల బ్యాంకు రుణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు చెల్లించడం లేదన్న హరీశ్ రావు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహిళలకు చేసిందేమీ లేదని, ఇప్పుడు మాత్రం మహిళలు అప్పుల పాలవుతున్నారు, ఆగమవుతున్నారని హరీశ్ రావు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆమె విమర్శించారు. బీఆర్‌ఎస్ సర్కార్ ఐదు సంవత్సరాల్లో మహిళా సంఘాలకు రూ. 3485 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 409 కోట్లు చెల్లించారన్నారు.