మీ మనసు బాధపడితే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటా: స్పీకర్
ABN , Publish Date - Mar 26 , 2025 | 05:31 AM
సభలో మహిళల గురించి చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ ప్రసాద్ కుమార్ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు తనను బాధపెట్టినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ‘మహిళలంటే నాకు ఎనలేని గౌరవం. నాకు 8 మంది అక్కాచెల్లెళ్లు ఉన్నారు. సభ్యుల రన్నింగ్ కామెంట్రీ వల్ల మీ మాటలు నాకే వినబడటం లేదని అన్నాను తప్ప... ఇందులో మరో ఉద్దేశం లేదు. మీ మనసు బాధపడి ఉంటే వెనక్కితీసుకుంటాను’ అని స్పీకర్ ప్రసాద్ కుమార్.. నర్సాపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో అన్నారు. సోమవారం సభలో మీ మాటలు నాకే వినబడటం లేదని స్పీకర్ తనను ఉద్దేశించే అన్నారని సునీతా లక్ష్మారెడ్డి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ఈ అంశాన్ని లేవనెత్తారు.
‘సభ్యుల హక్కులను కాపాడే బాధ్యత మీదే. ముఖ్యమంత్రి, మంత్రులు, సభ్యులు అన్‌పార్లమెంటరీ భాషను వినియోగిస్తున్నా... నేను మాత్రం క్రమశిక్షణకు కట్టుబడి ఉంటున్నాను. నియోజకవర్గ సమస్యలపైనే మాట్లాడుతుంటానే. మీ వ్యాఖ్యలు (మీరు మాట్లాడేది నాకే వినబడటం లేదు) నాకు బాధ కలిగించాయి... సభ అందరిదీ, నేను పరిధి దాటలేదు... ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలి’ అని ఆమె కోరగా... స్పీకర్ పై విధంగా స్పందించారు.
ఇవి కూడా చదవండి:
ఇది కారు లాంటి గేట్..
Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి
Stock Market Update: స్వల్ప లాభాల్లో గట్టెక్కిన నిఫ్టీ, సెన్సెక్స్ రెడ్ లో బ్యాంక్ నిఫ్టీ