Share News

Telangana Cabinet Expansion: మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్‌ భేటీ!

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:11 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంగళవారం సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం తదితర అంశాలపై చర్చలు జరిపారు

 Telangana Cabinet Expansion: మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్‌ భేటీ!

  • మంత్రివర్గ విస్తరణ, పీసీసీ పదవులపై చర్చ

న్యూఢిల్లీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంగళవారం సమావేశమైనట్టు తెలిసింది. సోమవారమే ఢిల్లీ వచ్చిన సీఎం రేవంత్‌.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి కాంగ్రెస్‌ అధిష్టానంతో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం అనంతరం భట్టి, ఉత్తమ్‌, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ రాష్ట్రానికి తిరుగు ప్రయాణమయ్యారు.


ఢిల్లీలోనే ఉండిపోయిన సీఎం రేవంత్‌ రెడ్డి.. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంగళవారం మళ్లీ సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలతో కలిసి మంత్రివర్గ విస్తరణ, పీసీసీ పదవులపై మరోమారు ఖర్గేతో చర్చించారని తెలిసింది. ఖర్గేతో భేటీ అనంతరం సీఎం రేవంత్‌ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ బయలుదేరారు.

ఇవి కూడా చదవండి:

ఇది కారు లాంటి గేట్..

Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి

Stock Market Update: స్వల్ప లాభాల్లో గట్టెక్కిన నిఫ్టీ, సెన్సెక్స్ రెడ్ లో బ్యాంక్ నిఫ్టీ

Updated Date - Mar 26 , 2025 | 04:14 AM