Home » Revanth Cabinet
సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆపాలని అతడికి సూచిస్తున్నారు. లేకుంటే బీసీలతో చెప్పు దెబ్బలు తినాల్సిన పరిస్థితి తీన్మార్ మల్లన్నకు వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
మైనార్టీల సంక్షేమానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్రంతో గత ప్రభుత్వంలా కాకుండా.. ఇప్పుడు సఖ్యతగా ఉంటున్నాం. పలు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. వివిధ పథకాల అమలుకు రాష్ట్రం తరఫున పూర్తి సహకారం అందిస్తున్నాం. వీటన్నింటినీ కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందా? కేంద్ర బడ్జెట్‌లో ఈసారైనా రాష్ట్రానికి వరాలు కురిపిస్తుందా?
జీవో-317పై కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సాయంత్రం 4.00 గంటలకు హైదరాబాద్‌లో భేటీ కానుంది. ఈ జీవో కారణంగా ఉద్యోగుల అభ్యర్థనలపై ఈ సబ్ కమిటీ చర్చించనుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది. ఇంకా పూర్తిస్థాయిలో మంత్రివర్గం కొలువుదీరలేదు. కేవలం రేవంత్‌తో పాటు 11మంది మంత్రులతో కేబినెట్ ఏర్పడింది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయలేదు.
రాష్ట్రంలో ఖరీఫ్ పంట కార్యాచరణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాయత్తమైంది. ఆ క్రమంలో రుణమాఫీ పథకం విధివిధానాలపై గురువారం హైదరాబాద్‌లో మంత్రులు.. టీఎస్ సీడ్స్ ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు.
ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థిపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఈ ఎన్నికల బరిలో దిగేందుకు పార్టీలోని పలువురు నాయకులు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజాగా ఖమ్మం లోక్‌సభ స్థానం అభ్యర్థి అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన నామినేటెడ్ పదవుల పంపిణీ.. మంత్రుల మధ్య చిచ్చు రాజేసింది. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం ఆధిపత్య పోరుకు తెరలేపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టే