RBI: 3000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం
ABN , Publish Date - Mar 12 , 2025 | 03:59 AM
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3000 కోట్ల అప్పు తీసుకున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది.

హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3000 కోట్ల అప్పు తీసుకున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది. 24 ఏళ్ల కాల పరిమితి, 7.23% వార్షిక వడ్డీతో రూ.1000 కోట్లు, 27 ఏళ్ల కాల పరిమితి, 7.23ు వార్షిక వడ్డీతో రూ.1000 కోట్లు, 28 ఏళ్ల కాల పరిమితి, 7.23% వార్షిక వడ్డీతో రూ.1000 కోట్ల చొప్పున ఈ అప్పును తీసుకున్నది. రాష్ట్రంతో కలిపి దేశంలోని మొత్తం 20 రాష్ట్రాలు రూ.49,522 కోట్ల అప్పులు తీసుకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Jagtial wedding tragedy: 24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు... చివరకు
Telangana MPs Meet: తెలంగాణ ఎంపీల సంచలన నిర్ణయం.. వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం..