Farmers: పంట నష్టపోయిన రైతులకు పరిహారం: తుమ్మల
ABN , Publish Date - Mar 25 , 2025 | 04:50 AM
అకాల వర్షాలు, వడగళ్ల వానలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

అకాల వర్షాలు, వడగళ్ల వానలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జీరో అవర్‌లో పలువురు సభ్యులు మాట్లాడుతూ.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని కోరారు. దీనిపై మంత్రి తుమ్మల కలుగజేసుకుని.. నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని, పంట నష్టం అంచనాలకు అధికారుల్ని ఆదేశించామని చెప్పారు.
ఇదే విషయమై మంత్రి ప్రకటన కూడా విడుదల చేశారు. నష్టపోయిన పంటలపై ప్రాథమిక నివేదిక వచ్చిందని పూర్తిస్థాయిలో సర్వే నివేదిక రాగానే రైతులకు నష్ట పరిహారం పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రాథమిక నివేదిక మేరకు.. 13 జిల్లాల్లో 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. రైతుల వారీగా సర్వే చేసి తుది నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించామన్నారు.