Share News

Weather: ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్.. రెండు రోజులు గజగజ వణకాల్సిందే..

ABN , Publish Date - Jan 07 , 2025 | 08:03 PM

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Weather: ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్.. రెండు రోజులు గజగజ వణకాల్సిందే..

హైదరాబాద్: తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని వెల్లడించింది. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జనవరి 8 నుండి 11 వరకు ఉష్ణోగ్రత 5 డిగ్రీలకు పడిపోవచ్చని పేర్కొంది. ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.


హైదరాబాద్‌లోనూ రానున్న రెండు రోజుల పాటు చలిగాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని తెలిపింది. జనవరి 9-10 మధ్య తీవ్రమైన చలిగాలులు వీస్తాయని, ఉష్ణోగ్రత 7-9 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుందని అంచనా వేసింది. కనీసం సంక్రాంతి వరకు చలిగాలులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Updated Date - Jan 07 , 2025 | 08:15 PM