మూడోసారి విచారణకు క్రిశాంక్
ABN, First Publish Date - 2025-04-18T16:16:19+05:30 IST
Krishank Interrogation: కంచ గచ్చిబౌలి భూముల కేసులో మూడో సారి పోలీసుల విచారణకు హాజరయ్యారు బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్. ఇప్పటికే రెండుసార్లు క్రిశాంక్‌ను పోలీసులు విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు.
హైదరాబాద్, ఏప్రిల్ 18: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై మరోసారి బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్ (BRS Leader Krishank) విచారణకు హాజరయ్యారు. మూడో సారి గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు వచ్చారు. క్రిశాంక్ మొబైల్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఇప్పటికే రెండు సార్లు క్రిశాంక్‌ను విచారించి కీలక విషయాలు రాబట్టారు. ఈ క్రమంలో మరోసారి విచారణకు హాజరుకావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కంచ గచ్చిబౌలి భూముల కేసులో ఏఐని ఉపయోగించి సోషల్ మీడియాలో నకిలీ ఫోటోలు, వీడియోలను పోస్టు చేశారనే ఆరోపణలు, అభియోగాలకు సంబంధించి ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇందులో భాగంగా క్రిశాంక్‌ను మూడో సారి పోలీసులు విచారిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
Cool Drink Incident: అసలేం తినేటట్టు లేదు.. తాగేట్టూ లేదుగా
Gold Purity: ఇంట్లోనే బంగారం ప్యూరిటీని చెక్ చేసుకోండిలా
Read Latest Telangana News And Telugu News
Updated at - 2025-04-18T16:59:09+05:30