అందరూ శిరీషను ఫాలో అవ్వండి..
ABN, Publish Date - Mar 03 , 2025 | 01:08 PM
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గిరిపుత్రుల సమస్యలపై ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడగా.. డిప్యూటీ స్పీకర్ రఘురామ ప్రశంసించారు.
అమరావతి, మార్చి 3: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను (MLa Gouthu Sireesha) డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు మెచ్చుకున్నారు. అంతే కాదు సభ్యులందరూ శిరీషను ఫాలో అవ్వాలని సూచించారు కూడా. ప్రశ్నోత్తరాల సందర్భంగా గిరిపుత్రుల సమస్యలను శాసనసభ ముందుకు తీసుకొచ్చారు ఎమ్మెల్యే శిరీష. గిరిపుత్రుల జీవినశైలి, వారి విధానాలను ఉద్దేశించి ఇంటిగ్రేడెట్ ట్రైబలర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటు అయ్యిందన్నారు. రాష్ట్రంలో ఐటీడీఏకు సంపూర్ణ ప్రాముఖ్యత కల్పించి, ప్రత్యేక నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లిన ఘనత నాటి సీఎం ఎన్టీఆర్ అయితే మరింత ప్రత్యేక దృష్టి పెట్టి మరిన్ని నిధులతో, కొత్త సంక్షేమ పథకాలతో ఐటీడీఏలకు సీఎం చంద్రబాబు మరింత శోభ తీసుకొచ్చారన్నారు.
అయితే గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా జరిగిన జిల్లాల విభజనల్లో శ్రీకాకుళంలో ఐటీడీఏలు లేకుండా పోయాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మినీ ఐటీడీఏ తీసుకొస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. త్వరలో మిని ఐటీడీఏను శ్రీకాకుళం జిల్లాకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే శిరీష కోరారు. దీనిపై డిప్యూటీ స్పీకర్ స్పందిస్తూ. మినీ ఐటీడీఏకు సంబంధించి ఎమ్మెల్యే చాలా క్లుప్తంగా అడిగారని.. అందరూ కూడా శిరీషను ఫాలో అవ్వాలని రఘురామ సూచించారు.
ఇవి కూడా చదవండి...
Case on Posani Murali Krishna: పోసానిపై కేసు.. రాజంపేటకు నరసారావుపేట పోలీసులు
Toddy Cat spotted: కృష్ణా జిల్లాలో అరుదైన జాతి పునుగుపిల్లి
Read Latest AP News And Telugu News
Updated at - Mar 03 , 2025 | 01:09 PM