స్నేహం పేరుతో దారుణం

ABN, Publish Date - Mar 20 , 2025 | 12:02 PM

Suryapet News: స్నేహం పేరుతో ఓ యువతి పట్ల ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సూర్యాపేట, మార్చి 20: జిల్లాలోని హుజూర్‌నగర్‌లో దారుణం జరిగింది. స్నేహం పేరుతో మాయమాటలు చెప్పి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారంటూ యువతి ఆరోపించింది. బలవంతంగా మద్యం తాగించి ప్రైవేటు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాధితురాలు వాపోయింది. ఇద్దరు యువకులు ప్రమోద్, హరీష్‌, యువతి రోజాపై బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

amareddy Car Accident: పెట్రోలింగ్ చేస్తూ ఆగిన కానిస్టేబుళ్లు.. ఇంతలోనే ఊహించని ఘటన

Bank Holidays: నాలుగురోజులు నిలిచిపోనున్న బ్యాంకు సేవలు.. ఎందుకంటే

Read Latest Telangana News And Telugu News

Updated at - Mar 20 , 2025 | 12:02 PM




News Hub