Home » Elections » Lok Sabha
మూడో విడత లోక్ సభ ఎన్నిక మే 7వ తేదీన జరగనుంది. మొత్తం 1352 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 392 మంది అంటే 29 శాతం అభ్యర్థులు కోటిశ్వరులు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్ బసిర్షత్ బీజేపీ అభ్యర్థి రేఖా పాత్రకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. రేఖాకు ఎక్స్ క్యాటగిరీ ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. సందేశ్ ఖాళీలో నెలకొన్న హింస, లైంగిక దాడి, భూ ఆక్రమణల గురించి ప్రపంచానికి రేఖా పాత్ర తెలియ జేశారు. మాజీ తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ అతని అనుచరుల ఆగడాలను వెలుగులోకి తీసుకొచ్చారు.
లోక్‌సభ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు (Nama Nageswara Rao)ని ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అవుతారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 12 పార్లమెంట్ సీట్లు గెలుస్తామని.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని ఉద్ఘాటించారు.
కేంద్రంలో మరోసారి బీజేపీ (BJP) అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. రిజర్వేషన్లు ముట్టుకుంటే బీజేపీ నేతలు మాడిమసై పోతారని వార్నింగ్ ఇచ్చారు.
అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ (Congress) గద్దెనెక్కిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. 10 ఏళ్లు కేంద్రంలో బీజేపీ ఉందని.. దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. పెట్రోల్ ధర, నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెంచిందని మండిపడ్డారు.
సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు మార్పింగ్ చేశారని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ( Kishan Reddy) అన్నారు. కాంగ్రెస్ (Congress) గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే తమ ప్రభుత్వం 5 గ్యారెంటీలను పూర్తి చేసిందని కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి (Rama Sahayam Raghuram Reddy) తెలిపారు. సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ (Congress) కార్యాలయంలో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్లొన్నారు. కాంగ్రెస్ నాయులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
మాయమాటలు చెప్పటం తప్పా ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) దేశానికి ఏం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ప్రశ్నించారు. సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరోసారి బీజేపీ, కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవుడైనా రాముడిని బీజేపీ నేతలు రాజకీయాల్లోకి తీసుకొచ్చి లబ్ధి పొందేలా ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి దానికి రాముడిని తెరమీదకు తీసుకువస్తున్నారని చెప్పారు. రాముడు ఏమైనా బీజేపీ ఎంపీనా, లేక బీజేపీ ఎమ్మెల్యేనా అని సూటిగా బీజేపీ నేతలను కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం జరుగుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అయితే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలు ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘానికి ఈ పార్టీలు శనివారం నాడు ఫిర్యాదు చేశాయి. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.