Share News

Loksabha Polls: మూడో విడత పోరులో కోటీశ్వరులు ఎంతమంది అంటే..?

ABN , Publish Date - Apr 30 , 2024 | 09:08 AM

మూడో విడత లోక్ సభ ఎన్నిక మే 7వ తేదీన జరగనుంది. మొత్తం 1352 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 392 మంది అంటే 29 శాతం అభ్యర్థులు కోటిశ్వరులు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ప్రకటించింది.

Loksabha Polls: మూడో విడత పోరులో కోటీశ్వరులు ఎంతమంది అంటే..?
loksabha poll candidates

ఢిల్లీ: మూడో విడత లోక్ సభ ఎన్నిక (Loksabha Polls) మే 7వ తేదీన జరగనుంది. మొత్తం 1352 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 392 మంది అంటే 29 శాతం అభ్యర్థులు కోటిశ్వరులు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ప్రకటించింది. వీరిలో ఒక్కో అభ్యర్థి కనీస ఆస్తి రూ.5.66 కోట్లుగా ఉంది. టాప్-3 అభ్యర్థులు తమకు రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. రూ.1361 కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో ఓ అభ్యర్థి ఉన్నారు. మహిళా అభ్యర్థులు కేవలం 9 శాతం మంది మాత్రమే 123 మంది పోటీలో ఉన్నారు.

Loksabha Polls: సందేశ్ ఖాళి బాధితురాలికి భద్రత


18 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 244 మందిపై కేసులు ఉండగా, ఐదుగురు అభ్యర్థులపై హత్యకు సంబంధించి అభియోగాలు నమోదయ్యాయి. 24 మందిపై హత్యాయత్నం కేసులు ఉండగా, 38 మంది మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులు ఉన్నాయి. 17 మంది ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన కేసులు ఫైల్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ పార్టీల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులపై కేసులు ఉన్నాయి.


చదువుకున్న అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు. 47 శాతం అంటే 639 మంది ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివారు. 44 శాతం మంది అంటే 591 మంది గ్రాడ్యుయేషన్ ఆపై చదువు పూర్తి చేశారు. 30 శాతం మంది అభ్యర్థులు అంటే 411 మంది 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వారు ఉన్నారు. 712 మంది అభ్యర్థులు 41 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారు ఉన్నారు.

Loksabha Polls: సందేశ్ ఖాళి బాధితురాలికి భద్రత


Read Latest
Election News or Telugu News

Updated Date - Apr 30 , 2024 | 09:13 AM