Share News

Lok Sabha Elections 2024: రాముడు ఏమైనా బీజేపీ ఎంపీనా లేదా ఎమ్మెల్యేనా.. కేటీఆర్ సూటి ప్రశ్న

ABN , Publish Date - Apr 28 , 2024 | 03:32 PM

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరోసారి బీజేపీ, కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవుడైనా రాముడిని బీజేపీ నేతలు రాజకీయాల్లోకి తీసుకొచ్చి లబ్ధి పొందేలా ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి దానికి రాముడిని తెరమీదకు తీసుకువస్తున్నారని చెప్పారు. రాముడు ఏమైనా బీజేపీ ఎంపీనా, లేక బీజేపీ ఎమ్మెల్యేనా అని సూటిగా బీజేపీ నేతలను కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.

Lok Sabha Elections 2024: రాముడు ఏమైనా బీజేపీ ఎంపీనా లేదా ఎమ్మెల్యేనా.. కేటీఆర్ సూటి ప్రశ్న

రాజన్న సిరిసిల్ల: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరోసారి బీజేపీ, కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవుడైనా రాముడిని బీజేపీ నేతలు రాజకీయాల్లోకి తీసుకొచ్చి లబ్ధి పొందేలా ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి దానికి రాముడిని తెరమీదకు తీసుకువస్తున్నారని చెప్పారు. రాముడు ఏమైనా బీజేపీ ఎంపీనా, లేక బీజేపీ ఎమ్మెల్యేనా అని సూటిగా బీజేపీ నేతలను కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.


Congress: బండి సంజయ్‌కు మంత్రి పొన్నం సవాల్..

రాముడు అందరికీ దేవుడేనని స్పష్టం చేశారు. రాముడిని దేశానికి బీజేపీనే పరిచయం చేసినట్లుగా ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ లేకపోతే బొట్టే పెట్టుకోలేము అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ ఉన్నా దేవుడు ఉంటాడని.. బీజేపీ లేకపోయిన దేవుడు ఉంటాడని తేల్చిచెప్పారు. ఆదివారం కరీంనగర్‌లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌ని గెలిపించాలని అభ్యర్థించారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు.


BJP: కేసీఆర్ అనే నాణానికి వారిద్దరూ బొమ్మ బొరుసులు: బండి సంజయ్

డమ్మీ క్యాండిడేట్‌ను పెట్టి సంజయ్‌ను మరోసారి ఎంపీగా గెలిపించాలని చూస్తున్నారని విమర్శించారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఎవరికీ తెలియదని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలమైన అభ్యర్థిని పెడితే బీఆర్‌ఎస్ గెలుస్తుందని రేవంత్ భయపడ్డారన్నారు. ‘‘రేవంత్ రెడ్డి సీఎం ఆ లేక బోటీ కొట్టేటోడా. పేగులు మెడలో వేసుకోవడం ఏందీ’’ అని ప్రశ్నించారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా బండి సంజయ్ తెచ్చారా అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి

KTR: ఇచ్చిన మాట నిలబెట్టుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం: కేటీఆర్‌

Konda Visveshwar Reddy: మోదీ వేవ్‌ తెలంగాణలోనూ కనిపిస్తోంది: కొండా

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 28 , 2024 | 03:43 PM