Home » Elections » Lok Sabha
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీమంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది రేవంత్ రెడ్డి అని స్పష్టం చేశారు. అందుకే బలహీన అభ్యర్థులను బరిలోకి దింపారని ఆరోపించారు.
మోదీ పాలనలో తెలంగాణలో ఉన్న ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వలేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అన్నారు. శనివారం నాడు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్ షోకు ముఖ్యఅతిథిగా కేసీఆర్ హాజరయ్యారు. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi), ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈరోజు గొప్పదినం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, బీఆర్ఎస్ పార్టీ పుట్టిన దినమని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేరు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో గల పాలకులు జైలుకు వెళ్లడం ఖాయం అని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ (KCR) తనకు ఇచ్చిన వారసత్వం కరువని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సెటైర్లు గుప్పించారు. తాను అధిపత్యంపై యుద్ధం చేస్తున్నానని అన్నారు. శనివారం నాడు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీళ్లు, కరెంట్ ఎక్కువగా ఇస్తున్నామని చెప్పారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ఓట్ల కోసం దేవుళ్లను రాజకీయ అంశాలుగా మార్చుకుంటారని వివరించారు. జనం నుంచి డబ్బులు వసూల్ చేసి మరి అయోధ్యలో ఆలయం నిర్మించారని గుర్తుచేశారు.
భారతీయ జనతా పార్టీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 400 సీట్లు గెలువాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేయబోతుందని మండిపడ్డారు.
మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని మాజీమంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దాంతో మల్లారెడ్డి స్పందించక తప్పలేదు. అసలు ఏం జరిగిందో మీడియాకు వివరించారు. తాను ఏదో సరదాకి అన్నానని, దానిని సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Mod) కాలనాగు లాంటి వాడని.. .పగబడితే విడవరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని.. బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శించారు. బ్రిటిష్ వారు గుజరాత్ నుంచి లోపలికి వచ్చారని... ఇండియాలో మనలో మనకే గొడవలు పెట్టారని విరుచుకుపడ్డారు.
బీజేపీ (BJP) దేశాన్ని పదేళ్ల నుంచి పరిపాలిస్తుందని.. దేశానికి ఏం చేసిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
దేవుడు అయిన రాముడినీ సైతం బ్యాలెట్ బాక్స్‌లోకి తీసుకురావడం చాలా సిగ్గుచేటని.. ఆ దౌర్భాగ్య స్థితికి బీజేపీ (BJP) తెరలేపిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఆరోపించారు. ప్రధానమంత్రి స్థానంలో ఉండి నరేంద్రమోదీ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు.