CM Revanth Reddy: మోదీ కాలనాగు.. పగబడితే విడవడు
ABN , Publish Date - Apr 26 , 2024 | 09:42 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Mod) కాలనాగు లాంటి వాడని.. .పగబడితే విడవరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని.. బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శించారు. బ్రిటిష్ వారు గుజరాత్ నుంచి లోపలికి వచ్చారని... ఇండియాలో మనలో మనకే గొడవలు పెట్టారని విరుచుకుపడ్డారు.
మెదక్ జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Mod) కాలనాగు లాంటి వారని... పగబడితే విడవరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని.. బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శించారు. బ్రిటిష్ వారు గుజరాత్ నుంచి దేశం లోపలికి వచ్చారని చెప్పారు. ఇండియాలో మనలో మనకే గొడవలు పెట్టారన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని పెద్ద శంకరంపేటలో ‘జనజాతర’ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Kothakota Srinivas: ప్రభాకర్‌కు రెడ్ కార్నర్ నోటీసులపై హైదరాబాద్ సీపీ షాకింగ్ కామెంట్స్
75 ఏళ్ల తర్వాత అదే గుజరాత్ నుంచి మోదీ, అమిత్ షా బయలు దేరారని అన్నారు. తామిద్దరం తమకు ఇద్దరం అన్నట్లుగా ఆదానీ, అంబానీలను వెంటవేసుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ చేతిలో తెలంగాణ తల్లి బంది అయ్యిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఫైర్ అయ్యారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేడీ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1200 చేశారన్నారు. అందుకే అడబిడ్డల ఉసురు తగిలి కేసీఆర్ పార్టీ పతనం అయిందని ఆక్షేపించారు. తాము రూ. 500 లకే సిలిండర్ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.
Congress: హరీష్‌రావు రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో లేదు: మంత్రి కోమటిరెడ్డి
ప్రతి పేదవాని ఇంట్లో రూ.200 యూనిట్ ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. కేసీఆర్ ఇందిరమ్మ ఇండ్లను డబ్బా ఇండ్లని అన్నారని మండిపడ్డారు. డబ్బా ఇండ్లు వద్దు.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ముద్దని అన్నారన్నారు. 4లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లును తాము మంజూరు చేశామని వివరించారు. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ ఎన్నికల్లో 400 సీట్లు గెలిచిన తర్వా త మోదీ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఉండే బడుగు, బలహీన వర్గాల రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
Balmoor Venkat: అలాంటి వ్యక్తి వచ్చాడనే గన్‌పార్క్ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేశా..
బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసి కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడగొట్టాలని చూస్తున్నాయన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు పేరు వచ్చింది అంటే అది ఇందిరమ్మ వల్లనేనని ఉద్ఘాటించారు. 10 ఏళ్లు మోసం చేసిన వారికి ఓటు వేస్తారా...?100 రోజుల్లో మంచి చేసిన వారికి ఓట్లు వేస్తారో ప్రజలు ఆలోచించాలని కోరారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను బీజేపీలోకి పంపిందే కేసీఆర్ అని.. ఆయన బిడ్డ కవిత బెయిల్ కోసం జహీరాబాద్‌లో బీజేపీ పార్టీని గెలిపించాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారని విమర్శించారు. బీబీ పాటిల్ ఒక్కసారైనా పార్లమెంట్‌లో తెలంగాణ, ప్రజా సమస్యలపై మాట్లాడారా అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
CM Revanth: రుణమాఫీ చేసి తీరుతాం... హరీష్ రాజీనామా రెడీగా పెట్టుకో.. రేవంత్ కౌంటర్
Read Latest Election News or Telugu News