Home » Elections » Lok Sabha
Telangana: భాగ్యనగరం ఖాళీ అవుతోంది. ఓట్లు వేసేందుకు తెలుగు ప్రజలు తమ తమ సొంతూర్లకు తరలివెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరం సగానికి పైగా ఖాళీ అవుతున్న పరిస్థితి. సొంతూర్లకు వెళ్లేందుకు ప్రజలు బస్టాండ్లకు తరలివెళ్తున్నారు. దీంతో జేబీఎస్ బస్టాండ్ వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగన వాసులు పల్లెబాట పట్టారు. ప్రయాణికులతో జేబీఎస్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఎన్నికలవేళ టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు ఆర్టీసీ 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
ఉమ్మడి పాలకుల కంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కువ మోసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. బీజేపీ నేత డీకే అరుణకు గుర్తింపు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. నేడు పాలమూరు జిల్లాలో పర్యటించిన మోదీ పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా గురించి మాట్లాడకపోవడం బాధాకరమని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల సమయమే ఉండటంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) విసృత్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా కరీంనగర్ నుంచి సిరిసిల్లకి వెళ్తుండగా కేసీఆర్‌కి మిడ్ మానేరు నిర్వాసితుల నిరసన సెగ తగిలింది.
దేశాన్ని పరిరక్షించడమే ఇండియా కూటమి లక్ష్యమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు, రాజ్యాంగాన్ని తీసివేసే బీజేపీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. దేశపు రాజ్యాంగాన్ని మార్చాలనుకోకపోతే కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్‌లో మెజార్టీ నాయకులు హిందువులేనని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ (Shashi Tharoor) తెలిపారు. హిందువులం హిందువులను ఎందుకు ద్వేషిస్తామని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ద్వేషం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉండనే ఉండదని స్పష్టం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా మూడు రోజుల సమయమే ఉండటంతో బీజేపీ ప్రచారాన్ని ఉదృతం చేసింది ఎన్నికల ప్రణాళికలో భాగంగా శుక్రవారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ (BJP) ‘‘భాగ్యనగర్ జనసభ’’కు పిలుపునిచ్చిది. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ సభలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు (Rajasingh) చేదు అనుభవం ఎదురైంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మోసగాడని.. తమను నిలువునా మోసం చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) అన్నారు. కేసీఆర్‌కి మనం అండగా నిల్చున్న రోజులు చాలా ఉన్నాయని.. ఆయన మనల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన మాట తప్పాడనీ ప్రశ్నిస్తే తనను జైల్లో పెట్టించారని విరుచుకుపడ్డారు.
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఆర్ ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఆరోపించారు. తాను ఆర్ ఆర్ ట్యాక్స్ అన్నాను.. కానీ ఎవ్వరి పేరు చెప్పలేదని.. కానీ సీఎం రేవంత్ మాత్రం మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు చెబతున్నారనిఅన్నారు. మొదట రాహూల్ ప్రేమ దుకాణం పెట్టి.. ఇప్పుడు విద్వేషం చూపుతున్నారని విమర్శించారు.
Telangana: ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చేయాల్సిన అన్ని పనులు పూర్తి చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు చాలా మంచి స్పందన వచ్చిందని... 14,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించారని వెల్లడించారు.