Share News

Lok Sabha Election 2024: పాలమూరులో గంజాయి మొక్కలను బొందపెడతాం.. రేవంత్ మాస్ వార్నింగ్

ABN , Publish Date - May 10 , 2024 | 09:03 PM

ఉమ్మడి పాలకుల కంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కువ మోసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. బీజేపీ నేత డీకే అరుణకు గుర్తింపు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. నేడు పాలమూరు జిల్లాలో పర్యటించిన మోదీ పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా గురించి మాట్లాడకపోవడం బాధాకరమని చెప్పారు.

Lok Sabha Election 2024: పాలమూరులో గంజాయి మొక్కలను బొందపెడతాం.. రేవంత్ మాస్ వార్నింగ్
CM Revanth Reddy

షాద్ నగర్: ఉమ్మడి పాలకుల కంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కువ మోసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. బీజేపీ నేత డీకే అరుణకు గుర్తింపు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. నేడు పాలమూరు జిల్లాలో పర్యటించిన మోదీ పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా గురించి మాట్లాడకపోవడం బాధాకరమని చెప్పారు.తాము అధికారంలోకి వచ్చి 100రోజుల్లో ఎలా దోచుకున్నామో మోదీ చెప్పాలని ప్రశ్నించారు.


Bandi Sanjay: కేసీఆర్ ఏమైనా సుద్ద పూసా? వేస్ట్ ఫెల్లో ఆఫ్ ఇండియా..

దొంగ సారాయి, కల్తీ కల్లు, కమీషన్లు తీసుకున్న డీకే అరుణను ఆయన పక్కన కూర్చోబెట్టుకుని తమ గురించి మాట్లాడితే ప్రజలు ఎలా నమ్ముతారని నిలదీశారు. తన జిల్లాకు వచ్చి తన గురించి మాట్లాడి తననే అవమానిస్తావా అని మండిపడ్డారు.జిల్లాలో డీకే అరుణ చరిత్ర ఏంటో తన చరిత్ర ఏంటో ప్రజలను అడిగితే తెలుస్తుందని అన్నారు. ఆమె కుటుంబం అంటే కేడీ కుటుంబం అని తెలుసుకొని మాట్లాడాలన్నారుతులసివనం లాంటి పాలమూరులో గంజాయి మొక్కలు వచ్చాయని ఆరోపించారు. దొంగలు ఎవరో గుర్తు పెట్టి వారిని బొంద పెడుతామని హెచ్చరించారు.ఓడించం అనే తమ మీద కోపంతో కేసీఆర్ బీజేపీతో వెళ్తున్నాడు కానీ అది మొదటికే మోసం అని తెలుసుకోలని హితవు పలికారు.


మతాల మధ్య సామరస్యం తెచ్చి ఒకరికొకరు కలిసి ఉండడంతో అభివృద్ధి సాధ్యమని వివరించారు. దేవుడి పేరు మీద భిక్షం ఎత్తుకొని గెలవాలని బీజేపీ అనుకుంటుందని విమర్శించారు. ఈ ఎన్నికలు పాలమూరు పౌరుషానికి ఢిల్లీ సుల్తాన్‌లకు మధ్య పోటీ అని తెలిపారు. కారు కార్ఖానాకి పోయింది అని బస్సులో పిట్టలదొర బయలుదేరారని ఎద్దేవా చేశారు. షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్న పవిత్ర జహంగీర్ పీర్ దర్గా సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Hyd News: మద్యం ప్రియులకు కీలక అప్‌డేట్.. రేపటి నుంచి..

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 10 , 2024 | 10:06 PM