Share News

Lok Sabha Election 2024: కాంగ్రెస్‌కు వారు డబ్బులు పంపిస్తుంటే.. మోదీ ఏం చేస్తున్నారు.. ఖర్గే సూటి ప్రశ్న

ABN , Publish Date - May 10 , 2024 | 07:13 PM

దేశాన్ని పరిరక్షించడమే ఇండియా కూటమి లక్ష్యమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు, రాజ్యాంగాన్ని తీసివేసే బీజేపీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. దేశపు రాజ్యాంగాన్ని మార్చాలనుకోకపోతే కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.

Lok Sabha Election 2024: కాంగ్రెస్‌కు వారు డబ్బులు పంపిస్తుంటే.. మోదీ ఏం చేస్తున్నారు.. ఖర్గే సూటి ప్రశ్న
Mallikarjun Kharge

నల్గొండ : దేశాన్ని పరిరక్షించడమే ఇండియా కూటమి లక్ష్యమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు, రాజ్యాంగాన్ని తీసివేసే బీజేపీకి (BJP) మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. దేశపు రాజ్యాంగాన్ని మార్చాలనుకోకపోతే కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. నల్గొండలో శుక్రవారం మల్లికార్జున్ ఖర్గే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు.


AP Elections: చివరి రెండు రోజులు.. ఎవరి వ్యూహాలు వారివి..!

పదేళ్లలో దేశంలోని సంపదని, ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ఆత్మీయ మిత్రులకు ధారాదత్తం చేశారని మండిపడ్డారు. మోదీ తెలంగాణ కోసం ఏం చేశారో చూపించాలని ప్రశ్నించారు. జవహర్ లాల్ నెహ్రు కాలంలో స్థాపించిన పెద్ద సంస్థలను మోదీ తీసేశారని విరుచుకుపడ్డారు. ఎలక్త్రో బాండ్ పేరుతో చందాలు ఇచ్చిన వారికే మోదీ దందాలు ఇచ్చారని విమర్శించారు. తమకు అనుకూలంగా ఉండే వారిపై రూ.13వేల కోట్ల ట్యాక్స్ వేసి ఇబ్బంది పెట్టారని ధ్వజమెత్తారు. ఐటీఐర్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మోదీ హామీలు ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు వేస్తామని చెప్పిన మోదీ వాగ్దానం ఇంకా పెండింగ్‌లో ఉందన్నారు.


AP Election 2024: వైసీపీ కోసం.. లూప్‌లైన్‌ ‘వ్యూహం’

కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు నెర వేర్చిందని పేర్కొన్నారు. 2024 ఆగస్టు 15 నాటికి రైతుల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరిచి చూపిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పాంచ్ న్యాయ్, 25 గ్యారెంటీలను అమలు చేస్తామని మాటిచ్చారు. కులగణన, జనగణన చేసి అందరికీ న్యాయం చేస్తామని ఉద్ఘాటించారు. కుల గణన చేశాక ఇంట్లో ఓ మహిళకి రూ.లక్ష నగదు జమ చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మూత పడటం ఖాయమని హెచ్చరించారు.


AP Election 2024 : విజన్ X విధ్వంసం.. చంద్రబాబు, జగన్‌కు తేడా ఇదే

బీజేపీకి అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తే ఆ పార్టీకి ఒక్క సీటూ రాదని చెప్పుకొచ్చారు. మోదీ అబద్దపు మాటలతో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి టెంపోలు, ఆటోల్లో డబ్బులు వస్తే మోదీ, అమిత్ షా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయనకు ధైర్యం ఉంటే అదానీ, అంబానీ మీద రైడ్స్ చేయించాలని సవాల్ విసిరారు. నల్లధనం తెస్తానన్న మోదీ ప్రజలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నా మోడీ ఇచ్చారా అని నిలదీశారు.


రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చేశారా అని అడిగారు. మోదీ అబద్దాలు చెప్పే వారికి అబద్దాల నాయకుడుని విమర్శించారు. మోదీకి తెలంగాణలో ఒక్క సీటు వచ్చినా రాజ్యాంగం అభద్రతలో పడుతుందని హెచ్చరించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే పౌరుల ప్రాథమిక హక్కులు కోల్పోతారని అన్నారు. స్వాతంత్ర్యం కోసం వారింట్లో ఎవరూ ప్రాణ త్యాగం చేయలేదని.. కాంగ్రెస్ పార్టీ నాయకుల త్యాగం చేశారని మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.

Bandi Sanjay: కేసీఆర్ ఏమైనా సుద్ద పూసా? వేస్ట్ ఫెల్లో ఆఫ్ ఇండియా..

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 10 , 2024 | 07:17 PM